కొన్నేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా బిచ్చగాడు రిలీజైనప్పుడు కనీసం పోస్టర్ ఖర్చులైనా వస్తాయాని అనుమానపడిన వాళ్ళే ఎక్కువ. కట్ చేస్తే ఊహించని విధంగా జనం బ్రహ్మరథం పట్టి బ్లాక్ బస్టర్ చేశారు. అయిదు పది కాదు ఏకంగా పాతిక కోట్లకు పైగా వసూళ్లతో అదరగొట్టేసింది. ఇప్పటికీ శాటిలైట్ ఛానల్ లో వచ్చిన ప్రతిసారి మంచి రేటింగ్స్ వస్తుంటాయి. మహేష్ బాబుతో ఢీ కొట్టి సక్సెస్ సాధించడం చిన్న విషయం కాదు. దెబ్బకు హీరో విజయ్ ఆంటోనీకి తెలుగులో ఒక్కసారిగా మార్కెట్ వచ్చింది. ఎంతవేగంగా వచ్చిందో అంతే వేగంగా వరస ఫ్లాపులతో పడిపోయింది.
ఇప్పుడీ ప్రస్తావనకు కారణం తుఫాన్. ఆగస్ట్ 2 ఈ సినిమా విడుదలని గతంలో ప్రకటించారు. దానికి తగ్గట్టే ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చారు. తీరా చూస్తే రిలీజ్ డేట్ దగ్గరగా ఉన్నా ఎలాంటి హడావిడి కనిపించడం లేదు. అసలీ టైటిల్ తో ఒక మూవీ వస్తోందనే సంగతే సగటు ప్రేక్షకులకు తెలియకుండా పోయింది. విజయ్ ఆంటోనీ కెరీర్ మొత్తం చూసుకుంటే బిచ్చగాడు తర్వాత దాని సీక్వెల్ మాత్రమే టాలీవుడ్ లో కమర్షియల్ గా వర్కౌట్ అయ్యింది. దాని ముందు వెనుకా ఏవీ కనీస స్థాయిలో ఆడలేదు. ఇప్పుడీ తుఫాన్ గురించి చూస్తూ ఉంటే ఓపెనింగ్స్ ఆశించకపోవడమే బెటరేమో.
ఇక్కడే కాదు తమిళంలోనూ తుఫాన్ పరిస్థితి ఇలాగే ఉంది. విజయ్ మిల్టన్ దర్శకత్వం ప్లస్ ఛాయాగ్రహణం నిర్వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో శరత్ కుమార్, సత్యరాజ్ వగైరా సీనియర్ క్యాస్టింగ్ పెద్దదే ఉంది. మురళి శర్మ లాంటి తెలుగు నటులూ ఉన్నారు. మేఘా ఆకాష్ చేసింది. హీరోతో పాటు అచ్చు రాజమణి సంయుక్తంగా సంగీతం సమకూర్చారు. అసలే ఆగస్ట్ 1, 2 తేదీల్లో విపరీతమైన చిన్న సినిమాల పోటీ ఉంది. శివం భజే, బడ్డీ లాంటివి కాసింత బజ్ మోస్తున్నాయి. తుఫాను లాంటి కాంపిటీషన్ లో ఈ తుఫాను ఆగి వస్తుందో లేక సై అని ఏ మేరకు తట్టుకుని నిలబడుతుందో చూడాలి.
This post was last modified on July 29, 2024 6:58 pm
విద్యాబాలన్.. బాలీవుడ్లో మంచి స్థాయి ఉన్న కథానాయిక. ఆమె కథానాయికగా మంచి ఫాంలో ఉన్న టైంలో తెలుగులో నటింపజేయడానికి ప్రయత్నాలు…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఈ ఏడాది సెప్టెంబరు 17తో 75 ఏళ్లు వస్తాయి. ప్రస్తుతం ఆయన వయసు 74…
రాబిన్ హుడ్ అంటే పెద్దోళ్లను దోచుకుని పేదోళ్లకు పెట్టేవాడు. ఈ పేరుతో ఓ తెలుగు సినిమా తెరకెక్కింది. రెండుసార్లు వాయిదా…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వేత్తల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం…
గత దశాబ్ద కాలంలో బహు భాషల్లో విజయాలు అందుకుని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద రేంజికి ఎదిగిన కథానాయిక రష్మిక…
కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఏది చేసినా వైరల్ అయిపోతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం కేంద్రంగా రాజకీయం చేస్తున్న కేతిరెడ్డి..…