కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్‌కు బహు భాషల్లో నటిగా మంచి పేరుంది. కన్నడలో ‘యు టర్న్’ మూవీతో మంచి పేరు సంపాదించాక ఆమె వేర్వేరు భాషల్లో విలక్షణ పాత్రలు పోషించింది. తెలుగులో ఆమెకు ‘జెర్సీ’ ఎంత ఫేమ్ తెచ్చిపెట్టిందో తెలిసిందే. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరో సరసన ‘సైంధవ్’ లాంటి పెద్ద సినిమా చేసే అవకాశం దక్కించుకుంది శ్రద్ధ. కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడం, అందులో శ్రద్ధ పాత్ర కూడా అంతంతమాత్రం కావడంతో నిరాశ తప్పలేదు. తర్వాత తెలుగులో ఆమెకు వెంటనే అవకాశాలు రాలేదు. కానీ కొంచెం గ్యాప్ తర్వాత నందమూరి బాలకృష్ణ లాంటి పెద్ద హీరో సరసన శ్రద్ధకు ఛాన్స్ వచ్చిందన్న వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
నటిగా శ్రద్ధ జర్నీ చూసినా.. ఆమె ఎంచుకున్న సినిమాలు, పాత్రలు చూసినా.. బాలయ్య లాంటి మాస్ హీరో సరసన ఆమె ఏమాత్రం సూటవుతుందో అన్న సందేహాలు కలుగుతాయి. అయినప్పటికీ కొన్నిసార్లు మాస్‌లో రీచ్ కోసమైనా ఇలాంటి సినిమాలు చేయాల్సిందే అనిపిస్తుంది. ఐతే ఈ సినిమాలో ఛాన్స్ వచ్చినట్లే వచ్చి శ్రద్ధ చేజారిందన్నది తాజా వార్త. షూట్‌లోకి వెళ్లాక తను సూట్ కాదని ఈ పాత్ర నుంచి తప్పించారా లేక ముందే ఏమైనా జరిగి ఆమెకు నో చెప్పారా అన్నది తెలియదు కానీ.. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధ మాత్రం లేదన్నది తాజా సమాచారం. ఆమె స్థానంలోకి ప్రగ్యా జైశ్వాల్ వచ్చిందటున్నారు.
ఐతే బాలయ్య సినిమా నుంచి శ్రద్ధ ఔట్ అని వార్త హల్‌చల్ చేస్తున్న సమయంలోనే మరో చిత్రంలో శ్రద్ధ నటిస్తున్న సంగతి వెల్లడైంది. బాలయ్య, ఎన్టీఆర్‌ల అభిమానిగా చెప్పుకోవడమే కాదదు, వాళ్లిద్దరితో బాగా సాన్నిహిత్యం ఉన్న విశ్వక్సేన్ సరసన శ్రద్ధ నటిస్తోంది. ఆ చిత్రమే.. మెకానిక్ రాకీ. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ అని అన్నారు. మరి ఆమెతో పాటు శ్రద్ధ కూడా ఉందా.. లేక మీనాక్షి స్థానంలోకి శ్రద్ధ వచ్చిందా అన్నది తెలియదు కానీ.. ఈ చిత్రం నుంచి పోష్ లుక్‌తో ఉన్న శ్రద్ధ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. మొత్తానికి బాలయ్యతో సినిమా అనుకుంటే ఆయన అభిమాని చిత్రంలో నటిస్తోందన్నమాట శ్రద్ధ.
This post was last modified on July 22, 2024 10:23 am
మొన్న డిసెంబర్ 25 విడుదల కావాల్సిన నితిన్ రాబిన్ హుడ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి తీసుకొచ్చే ఆలోచన…
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి కేసు సినీ పరిశ్రమను కుదిపేసింది. ఈ నెల 19న తెల్లవారుజామున 2.30…
తెలుగులో సంక్రాంతి పండక్కి సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? టాలీవుడ్‌కు సంబంధించి ఇదే బిగ్గెస్ట్ షార్ట్ సీజన్. ఈ…
ఇటీవలే విడుదలైన డాకు మహారాజ్ వారం తిరక్కుండానే వంద కోట్ల గ్రాస్ దాటేసి సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది.…
న్యూ ఇయర్ సందర్బంగా టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి... బీజేపీ మహిళా నేత, సినీ…
ఏదైనా పెద్ద సినిమాకు సంగీత దర్శకుడిని ఎంచుకునే పని స్టార్ హీరోల దర్శకులకు పెద్ద సవాల్ గా మారుతున్న తరుణంలో…