మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందిన మిస్టర్ బచ్చన్ విడుదల తేదీ విషయంలో ఇంకా నిర్ణయం వెలువబడలేదు. ఆగస్ట్ 15 అని అంతర్గత వర్గాల్లో బలంగా వినిపిస్తోంది కానీ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఎలాంటి అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు. అంటే ఆలోచనలో ఉన్నారని అర్థమవుతోంది. ఆ డేట్ కి రామ్ పూరిల డబుల్ ఇస్మార్ట్, గీత ఆర్ట్స్ 2 నిర్మించిన ఆయ్ తో పాటు 35 చిన్న కథ కాదు అనే మరో చిన్న సినిమా అధికారికంగా లాకయ్యాయి. విక్రమ్ తంగలాన్ వచ్చే అవకాశాలు కొట్టిపారేయలేం. ఆ టీమ్ నుంచి ప్రకటన రావడం ఒకటే పెండింగ్ ఉంది.
ఇక్కడ చిన్నపాటి చిక్కులున్నాయి. ఆగస్ట్ 2 ఆప్షన్ ఉంది చేతిలో ఉన్న తక్కువ టైంలో ప్రమోషన్లు చేసుకోవడం కష్టం. పోనీ అదే నెల చివరి వారంకు వెళదామంటే నాని సరిపోదా శనివారం సిద్ధంగా ఉంది. ఇండిపెండెన్స్ డే వారం మంచి టైం కావడంతో దాని మీద నిర్మాతలు గురి పెడుతున్నారు కానీ ఆల్రెడీ బరిలో ఉన్నవాటికి ఇబ్బంది కలిగించినట్టు అవుతుంది. అదేమీ సమస్య కాదనుకున్నా డబుల్ ఇస్మార్ట్ తో పోటీని కొంచెం సీరియస్ గా విశ్లేషించుకోవాలి. బాలీవుడ్ రైడ్ రీమేక్ గా రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ పాటల నుంచే ఆడియన్స్ లో అంచనాలు పెంచడం మొదలైంది.
ఈ లెక్కన సెప్టెంబర్ కు వెళ్లడం మినహా వేరే మార్గం ఉండకపోవచ్చు. ఆ నెల మొదటివారంలో నారా రోహిత్ సుందరకాండ, అల్లరి నరేష్ బచ్చల మల్లి, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ లు కాచుకోవచ్చు. 27న దేవర ఉంటుంది కాబట్టి దానికి ముందు వెనుకా వచ్చేందుకు పెద్ద బడ్జెట్ సినిమాలు రిస్క్ తీసుకోవు. ఇప్పటికైతే మిస్టర్ బచ్చన్ డేట్ సస్పెన్స్ గానే ఉంది. ఇంకోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. అజయ్ దేవగన్ నటించిన ఒరిజినల్ వెర్షన్ రైడ్ ని మరిపించేలా దర్శకుడు హరీష్ శంకర్ చాలా మార్పులు చేసినట్టు టీజర్ శాంపిల్స్ లో అర్థమైపోయింది.
This post was last modified on July 19, 2024 1:27 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…