ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు దక్కించుకున్న కిల్ దానికి బడ్జెట్ కు తగ్గట్టు నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ కి లాభాలు తీసుకొచ్చింది. ప్రమోషన్లు ఎక్కువ చేయకపోయినా ఆడియన్స్ కి రీచ్ అయిన విధానం బయ్యర్లను ఆశ్చర్యపరిచింది. ఒక రాత్రి పూట ట్రైన్ లో జరిగే ఒక సంఘటన ఆధారంగా రూపొందిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ని ఆ జానర్ ప్రేమికులు విపరీతంగా ఇష్టపడ్డారు. అయితే దీన్ని వివిధ భాషల్లో రీమేక్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. తెలుగులో సుధీర్ బాబు, కిరణ్ అబ్బవరం, సందీప్ కిషన్ లాంటివాళ్ళు ట్రై చేస్తున్నారట.
కాకపోతే ఇది రీమేక్ చేయాలా వద్దా అని నిర్ణయించుకునే ముందు కొంత విశ్లేషణతో కూడిన ఆలోచన అవసరం. ఎందుకంటే కిల్ అన్ని వర్గాలను టార్గెట్ చేసిన మూవీ కాదు. ఒక స్టయిలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్. మాస్ తో విజిల్స్ వేయించేవి, కుటుంబ ప్రేక్షకులను చివరి దాకా కూర్చోబెట్టేవి ఉండవు. హింసని ఇష్టపడేవాళ్ళకు మాత్రం గూస్ బంప్స్ అనిపించే ఎపిసోడ్లకు కొదవ ఉండదు. హిందీలో కొత్త హీరో చేశాడు కాబట్టి ఇబ్బంది రాలేదు. కానీ మన దగ్గర ఎవరైనా ఇమేజ్ ఉన్న హీరో ట్రై చేస్తే రీచ్ ఆశించిన స్థాయిలో రాకపోవచ్చు. దీని వల్ల ఖచ్చితంగా హిట్ అవుతుందా అంటే చెప్పలేం.
సర్వైవల్ థ్రిల్లర్స్ సౌత్ లో ఆడిన దాఖలాలు తక్కువ. నాగార్జున గగనం, రాజశేఖర్ మగాడు లాంటివి ఓ మోస్తరుగానే మెప్పించాయి తప్పించి బ్లాక్ బస్టర్ అందుకోలేదు. మలయాళం బ్లాక్ బస్టర్ హెలెన్ అక్కడ ఎంత విజయం సాధించినా తెలుగులో రీమేక్ చేసే సాహసం ఎవరూ చేయకపోయారు. హిందీలో జాన్వీ కపూర్ తో తీశారు కానీ ఫలితం దక్కలేదు. ఇదంతా ఒక ఎత్తయితే కిల్ ఈ నెల 23 నుంచే ఓటిటిలో రావొచ్చని ముంబై టాక్. డేట్ కొంచెం అటుఇటు అయినా రావడం పక్కా. కోట్లాది ప్రేక్షకులు అక్కడ చూసేస్తారు. సో ఈ రిస్కుకు ఏ హీరోలు సిద్ధపడతారో లెట్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on July 16, 2024 10:40 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…