ఇటీవలే విడుదలైన కల్కి 2898 ఏడిలో అశ్వద్ధామగా అదరగొట్టిన అమితాబ్ బచ్చన్ ఎంత ఆనందంలో ఉన్నారో చూస్తున్నాం. కొడుకు అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ హీరోనే ఇప్పటిదాకా గొప్పగా చెప్పుకునే బ్లాక్ బస్టర్లు సాధించలేదు.
ధూమ్ లాంటివి ఉన్నప్పటికీ ఇతని కంటే జాన్ అబ్రహం, హృతిక్ రోషన్ కు వచ్చిన పేరే ఎక్కువ. తండ్రి లెగసిని ఆ స్థాయిలో కొనసాగించలేకపోయాడనే అసంతృప్తి అభిమానుల్లో ఉంది కానీ సరైన పాత్ర దొరికితే చెలరేగిపోతాడని మణిరత్నం రావణ్ లాంటి వాటిలో బయట పడింది. ఆ మధ్య దస్వీ అనే వెబ్ మూవీ బాగానే హిట్ అయింది. అందుకే రూటు మార్చబోతున్నాడు.
షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న కింగ్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందులో తండ్రి కూతుళ్లు ఇద్దరూ కనిపిస్తారు.
కాకపోతే కింగ్ ఖాన్ స్పెషల్ గా డిజైన్ చేసిన క్యామియో కాబట్టి మొదటి నుంచి చివరి దాకా ఉండకపోయినా కీలక ఘట్టంలో మెరుస్తాడు. ఇందులో విలన్ గా అభిషేక్ బచ్చన్ ని లాక్ చేసుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. సుహానా కొన్ని నెలల క్రితం నెట్ ఫ్లిక్స్ మూవీ ఆర్చీస్ తో తెరంగేట్రం చేసింది. కంటెంట్ బాలేకపోవడంతో పాటు ఆమె నటన మీద విమర్శలు వచ్చాయి. అందుకే షారుఖ్ స్వయంగా రంగంలోకి దిగి కింగ్ సెట్ చేశాడు.
షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్ గతంలో కభీ అల్విదా నా కెహనా, హ్యాపీ న్యూ ఇయర్ లో కలిసి నటించారు. కానీ ఇలా హీరో విలన్ క్లాష్ మాత్రం ఇదే మొదటిసారి. సుహానాకు బాద్షా నిజ జీవితం లాగే నాన్నగా కనిపిస్తాడా లేక ఇంకేదైనా ట్విస్టు ఉందానేది వేచి చూడాలి.
విద్యా బాలన్ తో కహాని లాంటి థ్రిల్లర్ తో విమర్శకుల మెప్పు పొందిన సుజయ్ ఘోష్ కింగ్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. పఠాన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ పర్యవేక్షణతో పాటు షారుఖ్ తో కలిసి నిర్మాణ భాగస్వామ్యంలో పాలు పంచుకోబోతున్నాడు. బాలీవుడ్ క్రేజీ మూవీస్ లో ఒకటిగా కింగ్ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతుందని సమాచారం.
This post was last modified on July 15, 2024 10:35 pm
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…
శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…