భారీ ప్యాన్ ఇండియా సినిమాలు చూడటం అలవాటయ్యాక చిన్న చిత్రాలను చూసేందుకు థియేటర్లకు రావాలంటే ప్రేక్షకులు అంత ఈజీగా నిర్ణయం తీసుకోవడం లేదు. బలగం మొదటి రెండు రోజులు జనం లేరు. టాక్ బయటికి వచ్చి కుదురుకున్నాక నాన్ స్టాప్ గా దూసుకుపోయింది.
హనుమాన్ లో చిన్న హీరో ఉన్నాడని సంక్రాంతికి థియేటర్లు పెద్దగా ఇవ్వలేదు. కట్ చేస్తే ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టింది. సో ఫైనల్ గా కంటెంట్ ని నమ్ముకోవాల్సిందే. అయితే కొన్నిసార్లు ఈ టాక్ ని తెచ్చుకోవడానికి ఉపయోగపడే ప్రీమియర్లకు సైతం ప్రత్యేక ప్రమోషన్లు అవసరమవుతాయి.
ఈ నెల 19న విడుదల కాబోతున్న పేకమేడలు అలాంటి స్ట్రాటజీనే ఎంచుకుంది. మూడు రోజులు ముందుగానే వైజాగ్ తో మొదలుపెట్టి విజయవాడ అటుపై హైదరాబాద్ లో ప్రత్యేక షోలు వేస్తోంది. 150 రూపాయలు టికెట్ ని కేవలం 50 రూపాయలకే అమ్మబోతోంది.
అంటే కేవలం ముప్పై శాతం అసలు రేటుకి ఏసి మల్టీప్లెక్సులో సినిమా చూసేయొచ్చు. ఖచ్చితంగా ఇలాంటి వాటికి మంచి స్పందన ఉంటుంది. బొమ్మ బాగుందో లేదో తర్వాత సంగతి. తక్కువ ధరకు థియేటర్ ఎక్స్ పీరియన్స్ అందులోనూ కొత్త మూవీ అంటే సినీ ప్రియులు ఖచ్చితంగా ఒక ట్రయిల్ వేద్దాం అనుకుంటారు.
నా పేరు శివ, గ్యాంగ్స్ అఫ్ గోదావరిలో విలన్ గా పరిచయమున్న వినోత్ కిషన్ పేకమేడలు ద్వారా హీరోగా లాంచ్ అవుతున్నాడు. బజ్ పరంగా పెద్దగా అంచనాలు లేకపోవడంతో ప్రీమియర్లకు జనాన్ని ఆకట్టుకోవడం కోసం యాభై రూపాయల స్కీంని తీసుకొచ్చారు.
నిజానికి ఇలాంటివి తరచుగా చిన్న నిర్మాతలు చేస్తూ ఉండాలి. ఊరికే థియేటర్లకు రమ్మని ఈవెంట్లలో చెప్పి లాభం లేదు. టికెట్ రేట్లను వాళ్లకు అందుబాటులో ఉంచగగలితే కనక హీరో ఎవరనేది చూడకుండా వస్తారు. సినిమా మరీ బాగుంటే తర్వాత వందైనా ఇంకో యాభై ఎక్కువైనా ఖర్చు పెడతారు. ఇదో మంచి మార్కెటింగ్ ఎత్తుగడ.
This post was last modified on July 15, 2024 3:21 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…