2008లో ఐపీఎల్ ఆరంభమైనపుడు దాని ప్రెజెంటర్‌గా కనిపించిన కుర్రాడు ఆయుష్మాన్ ఖురానా. కొన్ని సీజన్ల పాటు అతను ఐపీఎల్ ప్రెజెంటర్‌గా పని చేశాడతను. ఆ వ్యక్తి ఇప్పుడు సాధించిన ఘనత చూసి నోరెళ్లబెట్టకుండా ఉండలేం. టైమ్ మ్యాగజైన్ ఏటా ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాను రిలీజ్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపుతూ.. జనాల మీద విశేషమైన ప్రభావం చూపే వ్యక్తులకు ఇందులో చోటు దక్కుతుంది.
ఇందులో ఇండియా నుంచి చోటు దక్కించుకున్న ఇద్దరు వ్యక్తుల్లో ఆయుష్మాన్ ఖురానానే ఒకడు కావడం విశేషం. ఈ జాబితాలో ఉన్న మరో వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ. భారత ప్రధాన మంత్రి అంటే ఎంత పవర్ ఫుల్ వ్యక్తో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పదవిలో ఉన్న వ్యక్తి ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం ఏమీ కాదు.
కానీ ఇండియాలో వివిధ భాషల్లో ఎంతో మంది సూపర్ స్టార్లు ఉండగా.. ఆయుష్మాన్ వాళ్లను వెనక్కి నెట్టి టైమ్-100 జాబితాలో చోటు దక్కించుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఐపీఎల్ యాంకర్‌గా పని చేసే సమయంలోనే ఆయుష్మాన్ టీవీ సీరియళ్లలోనూ నటించేవాడు. జాన్ అబ్రహాం నిర్మించిన ‘విక్కీ డోనర్’ సినిమాతో అతను హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ సినిమా సంచలనం విజయం సాధించింది. ఆ విజయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటూ ఆ తర్వాత మంచి మంచి సినిమాలు ఎంచుకుంటూ వరుస హిట్లతో దూసుకెళ్లాడు ఆయుష్మాన్.
గత కొన్నేళ్లలో బదాయి హో, అందాదున్, ఆర్టికల్ 15 లాంటి అద్భుతమైన సినిమాలు వచ్చాయి అతడి నుంచి. బాలీవుడ్లో ఎంతో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ నిలకడగా విజయాలు సాధిస్తున్న హీరోల జాబితా తీస్తే అతనే ముందుంటాడు. ఆయుష్మాన్ సినిమా అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారిప్పుడు. అతడి సినిమాలు అలవోకగా వంద కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అతడికి టైమ్ జాబితాలో చోటు దక్కింది.
This post was last modified on September 23, 2020 3:09 pm
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…
తిరుమల తొక్కిసలాట ఘటనపై శుక్రవారం సాయంత్రం టీటీడీ అత్యవసరంగా భేటీ అయి సమీక్షించింది. ఈ సమావేశంలో భాగంగా మృతుల కుటుంబాలకు…
ఏపీలోని కూటమి సర్కారు సంక్రాంతి సంబరాల ముంగిట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దాదాపుగా…
ఇప్పుడంటే సోషల్ మీడియా ఓ రేంజిలో ప్రతాపం చూపుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి తాను కూడా…
ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా…