ఎప్పుడో 2019లో విడుదలైంది ‘గద్దలకొండ గణేష్’ సినిమా. దాని తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాన్ని మొదలుపెట్టాల్సింది హరీష్ శంకర్. కానీ ఆ చిత్రం అనౌన్స్‌మెంట్‌కే పరిమితమైంది. మూడేళ్ల పాటు పవన్ కోసం ఎదురు చూసి చూసి అలసిపోయాడు హరీష్.
చివరికి వేరే కథ ఎంచుకుని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అంటూ కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఐతే ఈ చిత్రం సెట్స్ మీదికి అయితే వెళ్లింది కానీ.. చిత్రీకరణ సవ్యంగా సాగలేదు. వేరే కమిట్మెంట్లు కూడా ఉండడం వల్ల కొన్ని రోజులు మాత్రమే ఈ చిత్రానికి కాల్ షీట్స్ ఇచ్చాడు పవన్.
ఈలోపు ఏపీలో ఎన్నికలు వచ్చాయి. ‘ఉస్తాద్.. సంగతి అతీ గతీ లేకుండా పోయింది. పవన్ త్వరలో సినిమాలకు అందుబాటులోకి వస్తాడని అంటున్నా.. ‘ఉస్తాద్..’ ఆయన ప్రయారిటీ కాదని తెలుస్తోంది.
ఇప్పుడున్న బిజీ పొలిటికల్ షెడ్యూల్స్‌లో పవన్ హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలను పూర్తి చేస్తే ఎక్కువ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను పూర్తిగా ఆపేస్తున్నట్లుగా ఓ ప్రచారం మొదలైంది. దీని గురించి ట్విట్టర్లో ఎవరో ప్రస్తావిస్తే.. హరీష్ తనదైన శైలిలో రెస్పాండ్ అయ్యాడు.
అసలీ సినిమా మొదలే కాదని అన్నపుడే తాను రూమర్స్‌ను పట్టించుకోలేదని.. ఇప్పుడు రూమర్స్ చదివే టైం కూడా తనకు లేదని హరీష్ తేల్చేశాడు. దీంతో ‘ఉస్తాద్..’ ఆగిపోలేదని ఒక క్లారిటీ వచ్చేసినట్లయింది. ఐతే పవన్ ఈ సినిమా కోసం డేట్లు కేటాయించడానికి మాత్రం చాలా టైమే పట్టేట్లుంది.
దీంతో ఈలోపు ‘మిస్టర్ బచ్చన్’ను రిలీజ్ చేయించి.. ఇంకో సినిమాను కూడా లాగించేయాలని హరీష్ చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన తర్వాతి సినిమా చిరంజీవితో ఉండొచ్చని కూడా అంటున్నారు.
This post was last modified on July 5, 2024 8:39 pm
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్‌ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్‌ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…