ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఖరీదైన మందులు వాడలేని పరిస్థితిలో నీటిలో హైడ్రోజిన్ పెరాక్సాడ్ కలిపి దాన్ని నెబ్యులైజర్ ద్వారా పీల్చాలని సమంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పెద్ద దుమారమే రేపింది. దీన్ని ఘాటుగా ఖండిస్తూ రెండు లక్షలకు పైగా ఫాలోయర్లున్న లివర్ డాక్ (డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్) అనే వైద్యుడు సుదీర్ఘమైన పోస్టు పెట్టడంతో ఈ టాపిక్ గురించి రెండు రకాల చర్చలు జరగడం మొదలయ్యాయి. సామ్ ఇలాంటి సలహాలు ఇచ్చినందుకు ఆమెను జైల్లో పెట్టినా తప్పు లేదనే రీతిలో లివర్ డాక్ పేర్కొనడం మరింత వివాదానికి దారి తీసింది. దీన్ని సమంత అక్కడితో వదిలేయలేదు.
పాతికేళ్ల అనుభవం ఉన్న డాక్టర్ సూచనల మేరకు నేను ఫాలో అయిన ఎన్నో ఖరీదైన పద్దతులను విశ్లేషించుకున్న తర్వాత చెప్పాను తప్పించి ఎవరినో పక్కదారి పట్టించి డబ్బు సంపాదించే ఉద్దేశమే లేదని సమంత తేల్చి చెప్పింది. సామ్ కు మద్దతుగా నటుడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఎక్స్ లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నిజానికి సమంతా ఉద్దేశం మంచిదే అయినా సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన ఏ విషయమైనా జనం సీరియస్ గా ఫాలో అయ్యే అవకాశముంటుంది. అలాంటప్పుడు ఒకటికి పదిసార్లు అలోచించి పోస్ట్ చేయాలనేది నెటిజెన్లు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.
సినిమా బాలేకపోయినా చూడమని చెప్పడంలో వీసమెత్తు నష్టం లేదు కానీ జబ్బులతో ముడిపడిన చికిత్సలు చిన్నవైనా పెద్దవైనా ఇలా పబ్లిక్ గా అభిప్రాయాలు పంచుకొవడం ఎంతైనా రిస్కే. సమంత ఎంత పెద్ద గండం నుంచి బయటపడిందో యశోద సమయంలో అందరూ చూశారు. శాకుంతలం ప్రమోషన్లకు సైతం ఇబ్బంది పడుతూనే హాజరయ్యింది. తర్వాత బ్రేక్ తీసుకుంది. ఖుషిలో పరవాలేదనిపించినా మళ్ళీ కొత్త సినిమాలు ఒప్పుకోలేదు. ప్రస్తుతం తెలుగులో తనకున్న కమిట్ మెంట్ మా ఇంటి బంగారం ఒక్కటే. షారుఖ్, విజయ్ సినిమాల్లో ఛాన్స్ వచ్చిందనే టాక్ ఉంది కానీ ఇంకా నిర్ధారణ కావాలి.
This post was last modified on July 5, 2024 3:07 pm
ఒకే సినిమాపై సంవత్సరాల తరబడి ఖర్చు చేయడం బాహుబలి నుంచే మొదలయ్యిందని చెప్పాలి. గతంలో అంజి, అమ్మోరు లాంటివి సుదీర్ఘ…
ఐకాన్ స్టార్ అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్…
బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…
2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…
ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…