Movie News

అంతులేని కథగా అభిమాని హత్య

కర్ణాటకనే కాదు పక్క రాష్ట్రాల సినీ ప్రేమికులను షాక్ కి గురి చేసిన స్టార్ హీరో దర్శన్ ఉదంతం ఇంకా మలుపులు తిరుగుతూనే ఉంది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఇతనికి దాన్ని జూలై 18 దాకా పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

చిత్రదుర్గకు చెందిన అభిమాని రేణుకస్వామిని బెంగళూరు తీసుకొచ్చి దారుణంగా హత్య చేసిన కేసులో ఏ1గా ఉన్న దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడతో పాటు ఇరవైకి పైగా నిందితులు విచారణను ఎదురుకుంటున్నారు. దర్శన్ ఫ్యాన్స్ కొందరు తమ హీరోకు మద్దతుగా జైల్లో ఖైదీ డ్రెస్ మీద నెంబర్ ని బండ్లకు, కార్ల నెంబర్ ప్లేట్లకు స్టిక్కరింగ్ చేయించుకోవడం కలకలం రేపుతోంది.

ఇదిలా ఉండగా దర్శన్ భార్య విజయలక్ష్మి తాజాగా బెంగళూరు పోలీస్ కమీషనర్ దయానందకు ఓ లేఖ రాసింది. దర్శన్, పవిత్ర కేవలం స్నేహితులు మాత్రమేనని, ఆమెను సతీమణిగా పేర్కొంటూ హోమ్ మినిస్టర్ తో పాటు పలు మీడియా సంస్థలు చెప్పడం సరికాదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా చేయడం వల్ల తనకు తన బిడ్డకు భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని భయం వెలిబుచ్చింది.

పవిత్రకు సంజయ్ సింగ్ అనే వ్యక్తితో పెళ్లయి వాళ్ళకో కూతురు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసింది. రికార్డుల్లో ఈ విషయాలను స్పష్టంగా రాసుకోవాలని ఆమె అభ్యర్థించడం గమనించాల్సి విషయం.

ఎక్కడా తన భర్త మంచివాడని, న్యాయం గెలుస్తుందని విజయలక్ష్మి పేర్కొనలేదు. ఈ కేసులో పోలీసులకు కీలకమైన ఆధారాలు చాలా దొరికాయి. దర్శన్ కి బెయిల్ ఇస్తే అవి తారుమారు అయ్యే ప్రమాదముందని గుర్తించి న్యాయస్థానం మంజూరు చేయకుండా కస్టడీకి ఇస్తోంది.

ఇంకా విచారణకు ఎంత కాలం పడుతుంది, ట్రయిల్ నుంచి శిక్ష దాకా వెళ్ళేలోపు ఎన్ని నెలలు, సంవత్సరాలు కరిగిపోతాయోననే ఆందోళన జనంలో కనిపిస్తోంది. అయితే దర్శన్ బయటికి రావడం మాత్రం అంత సులభంగా లేదు. చూస్తుంటే ఇదో అంతులేని కథగా మారేలా ఉంది. క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందో.

This post was last modified on July 4, 2024 6:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మరోసారి భారత్ ఊచకోత

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి అదరగొట్టింది. రాయ్‌పూర్‌లోని షహీద్…

23 minutes ago

బోర్డర్ పరువును సీక్వెల్ నిలబెట్టిందా

1997లో విడుదలైన బోర్డర్ ప్రభంజనాన్ని అప్పట్లో చూసినవాళ్లు అంత సులభంగా మర్చిపోలేరు. పాకిస్థాన్ తో యుద్ధ నేపధ్యాన్ని దర్శకడు జెపి…

33 minutes ago

టాలీవుడ్‌పై కోలీవుడ్ కన్ను

తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా నంబర్ వన్ పొజిషన్‌లో ఉంది. వందల కోట్ల వసూళ్లు, మాస్ ఆడియన్స్ పల్స్…

38 minutes ago

ప్ర‌భాస్ ఫ్యాన్స్ బూతులు… ప్రొడ్యూసర్ ఫిర్యాదు

రాజాసాబ్ సినిమా మీద ప్ర‌భాస్ అభిమానులు పెట్టుకున్న ఆశ‌లు, అంచ‌నాలు నిల‌బ‌డ‌లేదు. సంక్రాంతి కానుక‌గా భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన…

2 hours ago

ఉస్తాద్ ముందుకు రావడం మంచిదే

సంక్రాతి సినిమాల సందడి ఒకవైపు కొనసాగుతుండగానే ఇంకోవైపు భవిష్యత్తులో విడుదల కాబోతున్న ప్యాన్ ఇండియా మూవీస్, వాటి రిలీజ్ డేట్ల…

2 hours ago

హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్… సిట్ ను ప్రశ్నించిన కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ…

3 hours ago