ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ విడుదలై వారం గడిచిపోయింది. మరి ఈ వారం రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూళ్లు సాధించిదన్నది ఆసక్తికరం. మేకర్స్ ఏకంగా 700 కోట్ల పోస్టర్ రిలీజ్ చేసేశారు కానీ.. వాస్తవ వసూళ్లు అంతకంటే 60 కోట్ల దాకా తక్కువ ఉన్నాయన్నది ట్రేడ్ పండిట్ల మాట. కలెక్షన్లను మేకర్స్ ఎక్కువ చేసి చూపించుకోవడం మామూలే. ఐతే మిగతా వాళ్లతో పోలిస్తే వైజయంతీ మూవీస్ ప్రకటించుకున్న వసూళ్లు మరీ ఎక్కువేమీ కాదు. కానీ బాక్సాఫీస్ వర్గాలు కూడా ‘కల్కి’ని బిగ్ హిట్ అనే చెబుతున్నాయి.
వారం వ్యవధిలో ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ.640 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు అంచనా. షేర్ రూ.325 కోట్లు వచ్చిందట. ఏపీ, తెలంగాణ వరకే ఈ చిత్రం రూ.190 కోట్ల మేర గ్రాస్.. రూ.120 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఈ లెక్కల ప్రకారం చూస్తే ‘కల్కి’ బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసినట్లే.
హిందీ బెల్ట్‌లో ప్రభాస్ తిరుగులేని బాక్సాఫీస్ స్టామినాకు ‘కల్కి’ మరో ఉదాహరణగా నిలిచింది. ‘కల్కి’ హిందీ వెర్షన్ ఏకంగా రూ.170 కోట్ల గ్రాస్.. రూ.85 కోట్ల మేర షేర్ రాబట్టింది. కర్ణాటకలోనూ ‘కల్కి’ అదరగొట్టింది. అక్కడ తెలుగు వెర్షనే రూ.50 కోట్ల దాకా గ్రాస్ కొల్లగొట్టింది. షేర్ పాతిక కోట్ల దాకా ఉంది.
విడుదలకు ముందు తమిళనాడు, కేరళల్లో అడ్వాన్స్ బుకింగ్స్ కొంచెం నెమ్మదిగా సాగాయి కానీ.. అక్కడి జనాలు కూడా సినిమాను బాగానే చూస్తున్నారని అర్థమవుతోంది. తమిళనాట గ్రాస్ రూ.30 కోట్లకు చేరువగా ఉ:డగా.. కేరళలో కూడా 18 కోట్లకు చేరువగా వసూళ్లు ఉన్నాయి. ఇండియా వరకే ‘కల్కి’ తొలి వారంలో రూ.460 కోట్ల గ్రాస్, రూ.250 కోట్ల దాకా షేర్ రాబట్టింది.
యుఎస్‌లో ఈ చిత్రం ఏకంగా 13 మిలియన్ డాలర్ల దాకా వసూళ్లు రాబట్టింది. అంటే మన రూపాయల్లో రూ.110 కోట్ల పైమాటే అన్నమాట. మిగతా దేశాల్లో రూ.70 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ మార్కు రూ.380 కోట్లు. ఫుల్ రన్లో ఈజీగానే ఆ మార్కును ‘కల్కి’ దాటేసేలా ఉంది.
This post was last modified on July 4, 2024 6:37 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…