Movie News

గ్రౌండ్ సెట్ చేసిన స్టెప్పామార్

ఎనర్జిటిక్ స్టార్ రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కలయికలో రూపొందుతున్న డబుల్ ఇస్మార్ట్ నుంచి మొదటి ఆడియో సింగల్ రిలీజ్ చేయడంతో అభిమానులు అలెర్ట్ అయిపోయారు. ఇస్మార్ట్ శంకర్ కు కొనసాగింపుగా రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా సంజయ్ దత్ విలన్ గా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాడు.

రామ్, పూరి ఇద్దరూ పెద్ద డిజాస్టర్ తర్వాత చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ కావడంతో అంచనాల పరంగా చాలా పెద్ద బరువునే మోస్తున్నారు. ఆగస్ట్ 15 విడుదలకు రంగం సిద్ధం చేసుకుని దానికి తగ్గట్టు ప్రమోషన్లను ప్లాన్ చేస్తున్నారు.

ఇక పాట సంగతి చూస్తే మణిశర్మ మరోసారి పక్కా మాస్ బీట్ తో కంపోజ్ చేశారు. మొదటిసారి విన్నప్పుడు ఫస్ట్ పార్ట్ లో టైటిల్ సాంగ్ లాగే అనిపించినా రెండింటికి చాలా వ్యత్యాసమున్న విషయం మెల్లగా అర్థమవుతుంది.

సీక్వెల్ కాబట్టి గెటప్ తో సహా అన్ని రిపీట్ చేయడం వల్ల విజువల్ గా ఆ ఫీలింగ్ కలిగినా మంచి క్యాచీ ట్యూన్ తో మెలోడీ బ్రహ్మ ఈసారి మరింత మాస్ పల్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అనురాగ్ కులకర్ణి, సాహితి గాత్రంలో భాస్కరభట్ల సాహిత్యం పూరి స్టాండర్డ్ కు తగ్గట్టే పూర్తి కమర్షియల్ స్కేల్ లో సాగింది. వినగా వినగా లిరిక్స్ ఆడియన్స్ లోకి వెళ్లేలా ఉన్నాయి.

ఛార్ట్ బస్టర్ అవుతుందో లేదో వెంటనే చెప్పలేం కానీ డబుల్ ఇస్మార్ట్ కు సంబంధించి అంచనాలు పెంచడంలో మాత్రం కీలక పాత్ర పోషించేలా ఉంది. రిలీజ్ కు ఇంకో 45 రోజులే ఉన్న నేపథ్యంలో పూరి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేశారు.

ఆ రోజు రెండు చిన్న సినిమాలతో పాటు విక్రమ్ తంగలాన్ పోటీకి వస్తుండటంతో మార్కెట్ పరంగా డబుల్ ఇస్మార్ట్ కే భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. అన్ని ప్రధాన భాషల్లో మల్టీ లాంగ్వేజ్ ప్లాన్ చేసుకున్న ఈ సినిమా ఫలితం పట్ల రామ్ చాలా నమ్మకంగా ఉన్నాడు. నెక్స్ట్ సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబుతో లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.

This post was last modified on July 1, 2024 10:57 pm

Share
Show comments
Published by
satya
Tags: Steppa Maar

Recent Posts

గొప్ప సినిమా ఓటిటిలో రాలేదేం

సలార్ విలన్ పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన ది గోట్ లైఫ్ ఆడు జీవితం థియేటర్లలో విడుదలై మూడు నెలలు దాటేసింది.…

31 mins ago

హిందీ సినిమాకు హాలీవుడ్ రీమేక్

హాలీవుడ్ సినిమాలను మనోళ్లు మక్కీకి మక్కీ దించేయడం ఎప్పట్నుంచో చూస్తున్నాం. ఐతే మన సినిమా కూడా గ్లోబల్ స్థాయికి చేరడంతో…

2 hours ago

కృష్ణుడికి గొంతిచ్చిన దాసుడి ఉద్వేగం

కల్కి 2898 ఏడిలో మొహం కనిపించకపోయినా ఆడియన్స్ ని విపరీతమైన ఉద్వేగానికి గురి చేసిన పాత్రల్లో శ్రీకృష్ణుడు ప్రధానమైంది. శరీరం…

3 hours ago

అమరావతిపై చంద్రబాబు శ్వేతపత్రం

అమరావతి రాజధానిని వైసీపీ అధినేత జగన్ అధ:పాతాళానికి తొక్కేశారని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి నడిబొడ్డున…

3 hours ago

శంకర్.. మూడు మెగా మూవీస్

భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్న దర్శకుడు శంకర్. ఇప్పుడందరూ పెద్ద పెద్ద బడ్జెట్లో భారీ…

3 hours ago

ఇకపై జగన్ కేసుల రోజువారీ విచారణ

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసు విచారణ గత ఐదేళ్లుగా నత్తనడకన సాగుతోన్న సంగతి…

4 hours ago