మాములుగా కెజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ లో నటిస్తే అవకాశాలు క్యూ కట్టాలి. మార్కెట్ పెరగాలి. కానీ హీరోయిన్ శ్రీనిధి శెట్టికి మాత్రం రివర్స్ లో జరిగింది. ఆఫర్లు రాకపోగా వచ్చిన ఒకే ఒక్క ఛాన్స్ విక్రమ్ కోబ్రా. అది దారుణంగా డిజాస్టర్ కావడంతో ఈ అమ్మడిని దాదాపుగా మర్చిపోయినంత పని చేశారు.
శాండల్ వుడ్ లో పట్టించుకోవడం లేదు కానీ తెలుగులో మాత్రం తనకు మెల్లగా ఆఫర్లు వస్తున్నాయి. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతున్న మూవీలో తనున్న సంగతి తెలిసిందే. రాశి ఖన్నాతో పాటు స్క్రీన్ పంచుకోవాల్సి వచ్చినా తగిన ప్రాధాన్యమే ఉందట.
ఇదిలా ఉండగా రానా దగ్గుబాటి సరసన మరో ఆఫర్ తలుపు తట్టిందని లేటెస్ట్ అప్డేట్. కిషోర్ అనే డెబ్యూ డైరెక్టర్ తో ఆర్కా మీడియా ఈ ప్రాజెక్టుని ప్లాన్ చేసింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్నారు. రానా ప్రస్తుతం తేజతో రాక్షస రాజ్యం కమిటయ్యి ఉన్నాడు. కానీ దాని తాలూకు కబుర్లేవి బయటికి రావడం లేదు.
గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నారో లేక ఆగిపోయిందో కూడా చెప్పడం లేదు. తేజ వర్కింగ్ స్టైల్ అంతే కాబట్టి ప్రకటన వచ్చే దాకా వేచి చూడాలి. ఈలోగా రానా ఇతర హీరోలతో తన స్వంత బ్యానర్ లో ప్రొడక్షన్ తో పాటు రానా నాయుడు 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
ఈ రెండు కనక శ్రీనిధి శెట్టి వర్కౌట్ అయితే మెల్లగా ఇక్కడ సెటిలైపోవచ్చు. తొలి చిత్రమే కెజిఎఫ్ లాంటి గ్రాండియర్ అయినప్పటికీ రేసులో ఇంతగా వెనుకబడటం ఆశ్చర్యం. కెరీర్ మొదలుపెట్టడం కొంత లేట్ కావడంతో మూడు పదుల వయసులో ఉన్న శ్రీనిధి శెట్టి అత్యవసరంగా ఒక బ్రేక్ అవసరం.
యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సిద్ధూ జొన్నలగడ్డకు జోడి కనక క్లిక్ అయితే మాత్రం పండగే. హీరోయిన్ల కొరత కాస్త ఎక్కువగానే ఉన్న టాలీవుడ్ లో సక్సెస్ అందుకుంటే చాలు సీనియర్ స్టార్లతో ఆడిపాడే అవకాశం ఉంటుంది. మరి తన అదృష్టం ఎలా ఉందో ఇవి విడుదలయ్యాకే తేలుతుంది.
This post was last modified on July 1, 2024 10:26 pm
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…