యూత్ హీరో నాగ శౌర్య ఈ మధ్య కనిపించడమే తగ్గించేశాడు. బయట ఈవెంట్లలో సైతం దర్శనం లేదు. పలువురు పిలుస్తున్నా సరే రానని చెబుతున్నాడట. గత కొన్నేళ్లుగా సక్సెస్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్న ఈ యువ కథానాయకుడి రెండు సినిమాలు సెట్స్ మీదున్నాయి కానీ వాటి తాలూకు అప్డేట్స్ బయటికి వచ్చి నెలలు గడిచిపోయాయి. ఒకదానికి ఎస్ఎస్ అరుణాచలం దర్శకుడు కాగా మరొకటి నారి నారి నడుమ మురారి వర్కింగ్ టైటిల్ తో ఎక్కడి దాకా వచ్చిందో తెలియడం లేదు. వీటి సంగతి పక్కన పెడితే నాగ శౌర్య గత చిత్రం రంగబలి ఫలితం తెలిసిందే.
చెప్పుకోదగ్గ అంచనాలతో విడుదలైన రంగబలి బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిలయ్యింది. ఎంటర్ టైన్మెంట్, మాస్ ఎలిమెంట్స్ మిక్స్ చేయబోయి ఖంగాళీగా మార్చడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. అయినా సరే దర్శకుడు పవన్ బసంశెట్టి టేకింగ్ మీద నమ్మకంతో నాగ శౌర్య మరొక్క ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు తెలిసింది. రంగబలి తీసిన సుధాకర్ చెరుకూరినే నిర్మాతగా వ్యవహరించబోతున్నట్టు సమాచారం. ఇది నష్టాలను పూడ్చుకోవడానికి తిరిగి కాంబో రిపీట్ చేస్తున్నారా లేక ఈసారి కథ ఖచ్చితంగా బాగుండి ఓకే అనుకున్నారా వేచి చూడాలి. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
2018లో ఛలో తర్వాత నాగ శౌర్య మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ చూడలేదు. ఓ బేబీ బాగానే ఆడినా అది సమంతా ఖాతాలో వెళ్లిపోయింది. అశ్వద్ధామ పర్వాలేదనిపించుకున్నా రిజల్ట్ దక్కలేదు. నర్తనశాల, వరుడు కావలెను, లక్ష్య, కృష్ణ వృందా విహారి, ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి ఒకదాన్ని మించి మరొకటి దెబ్బ కొట్టాయి. ఇక రంగబలి సంగతి సరేసరి. ఒక ఫ్లాప్ ఇచ్చినంత మాత్రాన డైరెక్టర్ టాలెంట్ ని తక్కువంచనా వేయలేం కానీ ఈసారి పవన్ తనతో పాటు నాగశౌర్యకు హిట్ ఇవ్వాల్సిన బలమైన బాధ్యత ఉంది. అంత నమ్మకం పెట్టుకున్నప్పుడు గురి తప్పకూడదు మరి.
This post was last modified on June 19, 2024 3:20 pm
సౌతాఫ్రికా సిరీస్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…
రీఎంట్రీ తర్వాత వరుసగా మూడు రీమేక్‌లతో పలకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో రెండు…
మన శంకరవరప్రసాద్ గారు నుంచి మరో పాట వచ్చేసింది. నిజానికీ రిలీజ్ రేపు జరగాలి. కానీ ఒక రోజు ముందుగా…