ఆన్ లైన్ ప్రపంచంలో అందులోనూ యూట్యూబ్ లాంటి సామజిక మాధ్యమాల ద్వారా పాపులారిటీతో పాటు డబ్బులు రావడం మొదలయ్యాక ఎవరికి వారు రీచ్ పెంచుకుని సెలబ్రిటీలా ఫీలవుతున్న దాఖలాలు నిత్యం చూస్తున్నాం. పాజిటివ్, నెగటివ్ కోణం ఏదైనా సరే ఫాలోయర్స్ ని పెంచుకునే క్రమంలో అధిక శాతం యుట్యూబర్లు ఆధారపడుతున్నది సినిమాల మీదే. అందులోనూ ఒక విభిన్నమైన అప్రోచ్ తో వీడియో రివ్యూలు చెప్పేవాళ్లకు డిమాండ్ బాగానే ఉంది. ఇటీవలే ఒక యువకుడు కల్కి ట్రైలర్ లోని విజువల్స్ హాలీవుడ్ మూవీస్ ని పోలి ఉన్నాయంటూ ఒక రివ్యూ పోస్ట్ చేశాడు.
ఇది చూసిన విశ్వక్ సేన్ ఇన్స్ టాగ్రామ్ లో స్పందిస్తూ ఇలాంటి వాళ్ళు పరిశ్రమకు చీడపురుగులని, ఒక షార్ట్ ఫిలిం తీసి చూపిస్తే అప్పుడు అతని సత్తా తెలుస్తుందని, పైరసీ కంటే వీళ్ళే ప్రమాదకరంగా మరుతున్నారని సుదీర్ఘమైన మెసేజ్ ఒకటి స్టేటస్ పెట్టాడు. దానికి అవతలి వ్యక్తి కూడా బదులిస్తూ ఒపీనియన్ స్పెల్లింగ్ మీకు రాలేదు కాబట్టి చెప్పకూడదని నేను అనలేదని, గతంలో గుంటూరు కారం టైంలో నిర్మాత నాగవంశీతో చేసిన చర్చ గురించి ప్రస్తావిస్తూ కావాలంటే అలా మాట్లాడుకుందామంటూ ఆఫర్ ఇచ్చాడు. ఇదంతా చూస్తున్న నెటిజెన్లు రెండు వైపులా మద్దతుగా వ్యతిరేకంగా విడిపోయారు.
తప్పొప్పుల గురించి పక్కనపెడితే కొన్నిసార్లు అటెన్షన్ కోసం వీడియో రివ్యూలు చేసే వాళ్లకు సెలబ్రిటీలు స్పందించడం మొదలుపెడితే ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది. సదరు హీరో చెప్పనిదాంట్లో పాయింట్ ఉందా లేదా అనే దానికన్నా అటు యూట్యూబర్ ఇమేజ్ తో పాటు రీచ్ కూడా పెరిగిపోతుంది. కేవలం ఒక వ్యక్తి చెప్పిన అభిప్రాయాన్ని బట్టి అమాంతం సినిమా కలెక్షన్లు ప్రభావితం చెందటం ఉండదు. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ ఏదీ పట్టించుకోరు. థియేటర్లకు వెళ్ళిపోతారు. ఇది మర్చిపోయి వాదనకు దిగితే మాత్రం లాభం కలిగేది ఖచ్చితంగా సోషల్ మీడియా ఇన్ఫ్లూ యెన్సర్లకే.
This post was last modified on June 19, 2024 11:08 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…