మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప టీజర్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. విజువల్స్ బాగున్నప్పటికీ సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపించిన మాట వాస్తవం. విష్ణు గతంలో చెప్పినట్టు ఉద్దేశపూర్వకంగానో లేక మరో కారణం చేతనో కన్నప్ప కూడా కొంత ట్రోలింగ్ బారిన పడుతోంది. క్యాస్టింగ్ ని రివీల్ చేయకుండా కేవలం హీరోని మాత్రమే హైలైట్ చేయడం వల్ల ఫీడ్ బ్యాక్ లో హెచ్చుతగ్గులు కనిపించాయి. దీని సంగతలా ఉంచితే కన్నప్పకు అతి పెద్ద టాస్క్ విడుదల తేదీని సెట్ చేసుకోవడం. దీనికి ముందుచూపు అవసరమయ్యేలా ఉంది.
కన్నప్పలో ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్ లాంటి క్యాస్టింగ్ ఉన్న దృష్ట్యా వీలైనంతగా ఈ గ్రాండియర్ ని సోలో రిలీజ్ చేసుకోవడం ముఖ్యం. ప్రధానంగా డిసెంబర్ నెలని పరిశీలనలో ఉంచారని తెలిసింది. ఆ నెల ఆరో తేదీ అఫీషియల్ గా పుష్ప 2 ది రూల్ లాకయ్యింది. 20ని అధికారికంగా తీసుకున్న చైతు తండేల్, నితిన్ రాబిన్ హుడ్ రెండు వారాల గ్యాప్ చాలనుకుంటాయా లేక పోటీ నుంచి తప్పుకుంటాయా తెలియదు. ఒకవేళ కన్నప్ప నిజంగా డిసెంబర్ ని టార్గెట్ చేసుకుని వీలైనంత త్వరగా విడుదల తేదీ ప్రకటించాలి. అప్పుడే పోటీకి సంబంధించిన అవగాహన కలుగుతుంది.
కన్నప్ప తరహా గ్రాండియర్లు డిసెంబర్ జనవరిలో మరో రెండు వచ్చే అవకాశముంది. హరిహర వీరమల్లుని ఆ నెలలోనే తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు నిర్మాత ఏఎం రత్నం. చిరంజీవి విశ్వంభర జనవరి 10 ఉంది. సో తక్కువ గ్యాప్ లో విఎఫెక్స్ సినిమాలు పోటీ పడుతున్నప్పుడు ఖచ్చితంగా పోలికలు వస్తాయి. కన్నప్ప విషయంలో అవి మరీ ఎక్కువగా ఉండే ఛాన్స్ కొట్టిపారేయలేం. సో ముందే వస్తే ఈ గొడవ ఉండదు. పాజిటివ్ టాక్ వచ్చాక ఎవరు ఎలా లక్ష్యంగా పెట్టుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫైనల్ గా కన్నప్పని ఎప్పుడు థియేటర్లలో దించాలనే చర్చ మంచు బృందంలో జోరుగా జరుగుతోంది.
This post was last modified on June 19, 2024 11:03 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…