నాగ చైతన్య ‘లవ్‍స్టోరీ’ షూటింగ్ చాలా భాగం పూర్తి కావాల్సి వుంది. అందుకే అందరికంటే ముందుగా షూటింగ్ మొదలు పెట్టేసి చకచకా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. శేఖర్ కమ్ముల మామూలుగా టార్గెట్స్ అవీ పెట్టుకోడు కానీ ఈసారి మాత్రం సంక్రాంతి రిలీజ్ టార్గెట్‍గా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేస్తున్నాడట.
నటీనటులు కాకుండా కేవలం పన్నెండు మంది క్రూతో శేఖర్ షూటింగ్ చేస్తున్నాడు. ఇందుకోసం ఛీఫ్ టెక్నీషియన్లపై కూడా అదనపు భారం పడినా కానీ ఎవరూ కాదనకుండా షూటింగ్ చేసేస్తున్నారు. ఈ సినిమా స్పీడుగానే పూర్తయిపోతుందని, తప్పకుండా సంక్రాంతి నాటికి రిలీజ్‍కి సిద్ధమయిపోతుందనీ చెబుతున్నారు. ఈ సినిమాను ఫలానా టైమ్‍కి విడుదల చేస్తామని ప్రకటించలేదు కానీ టార్గెట్ అయితే సంక్రాంతే అంటున్నారు. మరి నాగచైతన్య సినిమా సంక్రాంతికి వస్తే ఆల్రెడీ సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రకటించేసిన అఖిల్ సినిమా సంగతేంటి? ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‍లర్’ కూడా ప్రస్తుతానికి సంక్రాంతి రేసులో వుంది.
ఒకే టైమ్‍లో అన్నదమ్ముల సినిమాలు విడుదల చేస్తే ఫాన్స్ కూడా ఏ సినిమాకి ప్రిఫరెన్స్ ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడతారు. నాగచైతన్య సినిమా బడ్జెట్ ఎక్కువ కనుక అతనికి సంక్రాంతి బెస్ట్ ఆప్షన్. మరి అన్నయ్య కోసమని అఖిల్ వెనక్కి వెళతాడా? లేదా ఈసారి అన్నదమ్ములిద్దరూ కలిసి పండక్కి సందడి చేస్తారా?
This post was last modified on September 21, 2020 11:12 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…