ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటైన ‘పుష్ప’ నుంచి టీం ఒక్కో పాట రిలీజ్ చేస్తోంది. కొన్ని వారాల కిందట ‘పుష్ప పుష్ప…’ అంటూ టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. అది బ్యాడ్ సాంగ్ అనలేం కానీ.. ‘పుష్ప’లోని పాటల స్థాయిలో మాత్రం ఇంపాక్ట్ వేయలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి రెండో పాట లాంచ్ చేశారు. ‘సూసేకి..’ అంటూ సాగే ఈ పాటను శ్రేయా ఘోషల్ గొప్పగా ఆలపించించింది. ఇప్పుడు లేడీ సింగర్స్ ఎందరు ఉన్నా శ్రేయా ఘోషల్ చాలా స్పెషల్ అనడానికి ఈ పాటను రుజువుగా చూపిస్తున్నారు. ఇక ఈ పాటను చంద్రబోస్ చాలా బాగా రాశారు. లిరిక్స్ గురించి ప్రత్యేక చర్చ జరుగుతోంది.
ఐతే ఎటొచ్చీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విషయంలో మాత్రం పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం లేదు. ట్యూన్ విషయంలో దేవి మీద విమర్శలు వస్తున్నాయి. ఇది చాలదన్నట్లు లిరికల్ వీడియో రూపకల్పన విషయంలోనూ దేవి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
‘సూసేకి..’ లిరికల్ వీడియోలో దేవిశ్రీ ప్రసాద్ పేరు ముందు ‘నేషనల్ అవార్డ్ విన్నర్’ అని వేశారు. దేవి గత ఏడాదే ‘పుష్ప’ చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పటికే శ్రేయా ఘోషల్ ఐదుసార్లు జాతీయ అవార్డు గెలిచిన విషయం మరువరాదు. మామూలుగా అయితే ఈ విషయాన్ని ప్రస్తావించాల్సిన పని లేదు కానీ.. దేవి పేరు ముందు అలా వేసుకున్నపుడు శ్రేయాకూ కూడా వేయాల్సిందే కదా అన్న చర్చ నడుస్తోంది.
శ్రేయా సంగతి పక్కన పెడితే.. దేవి జాతీయ అవార్డు గెలవడానికి ముందే ‘నాటు నాటు’ పాటకు ఏకంగా ఆస్కార్ పురస్కారం గెలుచుకున్నారు చంద్రబోస్. కానీ ఆయన పేరు ముందు మాత్రం ఆ ప్రస్తావన లేదు. పైగా లిరికల్ వీడియోలో ఆయన పేరును తప్పుగా ‘చందబోస్’ అని వేశారు. దీంతో ఆల్రెడీ పాట విషయంలో దేవిని తిడుతున్న వాళ్లు.. ఈ విషయాలను కూడా ప్రస్తావించి అతడిని ట్రోల్ చేస్తున్నారు.
This post was last modified on May 31, 2024 3:39 pm
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో సిట్…
ఈ రోజుల్లో ఓ పెద్ద సినిమా నుంచి ఒక చిన్న అప్డేట్ ఇవ్వాలంటే దానికి ఎంత హడావుడి చేస్తారో? అప్డేట్…
సెన్సెక్స్ మాదిరి బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళుతున్న వైనం ఇటీవల కాలంలో చోటు చేసుకుంటుంది. ఉదయం ఉన్న ధర…
భారత్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆఫ్ లైన్ లోనే కాదు…