మెగా హీరోలలో వరుణ్ తేజ్ ఒక్కడిదీ విభిన్నమైన పంథా. మెగా హీరోలంటే మాస్ డైలాగులు, బ్రేక్ డాన్సులు అనేది ఫాన్స్ నిశ్చితాభిప్రాయం. కానీ వరుణ్ తేజ్ అవేమీ చేయకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఒకే మూసలో పడిపోకుండా అన్ని రకాల పాత్రలు, సినిమాలు చేస్తున్నాడు. మెగా హీరోలందరిలోను తను ప్రత్యేకమని అనిపించుకున్నాడు.
ఇప్పుడు మరో మెగా హీరో కూడా అదే దారిలో వెళుతున్నాడు. చిరంజీవి మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఇమేజ్ తెచ్చే పాత్రల కోసం చూడడం లేదు. సగటు కుర్రాడిని తలపించే పాత్రలే ఏరి కోరి ఎంచుకుంటున్నాడు. మొదటి సినిమా ఉప్పెన విడుదల కాకుండానే క్రిష్‍తో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం కమర్షియల్ సినిమాలా కాకుండా ఆర్ట్ ఫిలిం తరహాలో వుంటుందని అంటున్నారు. వరుణ్ కూడా రెండవ సినిమా కంచె క్రిష్ డైరెక్షన్‍లోనే చేసాడు.
ఆ సినిమాతోనే అతనికి హీరోగా ఐడెంటిటీ వచ్చింది. అక్కడ్నుంచీ అన్నీ విభిన్నమైన సినిమాలే ఎంచుకుంటూ వెళ్లాడు. మాస్ సినిమాలు చేసి, చేసి ఒకానొక దశలో కెరీర్ ప్రమాదంలో పడిన తన అన్నయ్య సాయి ధరమ్ తేజ్ అనుభవంతో ఈ ట్రెండ్‍లో మాస్ సినిమాలు కరక్ట్ కాదని ఈ యువ హీరో ముందే పసిగట్టేసాడు. ఓటిటి జమానాలో ప్రయోగాలకు ఫుల్ డిమాండ్ ఇప్పుడు.
This post was last modified on September 23, 2020 3:02 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…