గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ కోసం తమిళ స్టార్ హీరో అజిత్ హైదరాబాద్ లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఇవాళ తనకు దగ్గరగా షూటింగ్ జరుగుతున్న విశ్వంభర సెట్ కు వెళ్లి చిరంజీవిని కలిశాడు. ఇందులో పెద్ద విశేషం ఏముందనుకుంటే పొరపాటే. కారణం ఈ కలయిక కనీసం ఇలా ఫోటో రూపంలో జరిగి ముప్పై ఒక్క ఏళ్లయ్యిందంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. 1993లో అజిత్ అమరావతి అనే కోలీవుడ్ మూవీతో డెబ్యూ చేశాడు. దీనికన్నా ఏడాది ముందు తెలుగులో ప్రేమ పుస్తకం సినిమా ఒప్పుకున్నాడు. ప్రముఖ నటులు, రచయిత గొల్లపూడి మారుతీరావు అబ్బాయి శ్రీనివాస్ దర్శకుడు.
షూటింగ్ కొంత భాగం అయ్యాక వైజాగ్ లో చిత్రీకరణ జరుగుతుండగా నీటి ప్రమాదంలో శ్రీనివాస్ హఠాన్మరణం చెందారు. మిగిలిన సినిమాను పుత్రశోకాన్ని దిగమింగుకుని మారుతీరావు గారు పూర్తి చేశారు. ఆడియో లాంచ్ కి చిరంజీవి ముఖ్యఅతిథిగా విచ్చేసి టీమ్ ని ఆశీర్వదించారు. అప్పటికే ఆయన మెగాస్టార్ కాగా అజిత్ ఇంకా తను సెటిలయ్యేది తమిళమా తెలుగానే అయోమయంలో ఉన్నాడు. దురదృష్టవశాత్తు ప్రేమ పుస్తకం ఫ్లాప్ అయ్యింది. ఇంకోవైపు కోలీవుడ్ అజిత్ కి హిట్లతో స్వాగతం పలికింది. కట్ చేస్తే అప్పుడు చెన్నై వెళ్లిన తలా మళ్ళీ తిరిగి వచ్చే అవసరం ఎప్పుడూ పడలేదు.
ఇదంతా జరిగి మూడు దశాబ్దాలు దాటిపోయింది. అజిత్ పక్కరాష్ట్రంలో తిరుగు లేని స్టార్ డం అందుకున్నాడు. విజయ్ రూపంలో పెద్ద పోటీ ఉన్నా తట్టుకుని మరీ తనదైన ఫ్యాన్ డంని సృష్టించుకున్నాడు. నిరాడంబరతకు మారుపేరుగా చెప్పుకునే అజిత్ ఇంత గ్యాప్ తర్వాత ఒక తెలుగు నిర్మాణ సంస్థ(మైత్రి)కు సినిమా చేయడం, అది భాగ్యనగరంలో జరుగుతుంటే చిరుని కలుసుకోవడం తీపి జ్ఞాపకంగా అభిమానులు నెమరువేసుకుంటున్నారు. ఇదంతా ఓకే కానీ ఈ ఇద్దరి కలయికలో ఒక మల్టీస్టారర్ వస్తే బాగుంటుంది కదూ. కొన్ని ఊహలకే పరిమితమవుతాయి తప్ప నిజం కావడం అసాధ్యమే.
This post was last modified on May 29, 2024 5:13 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…