Movie News

అల్లరి నరేష్.. ఈసారి ఊర మాస్


ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న అల్లరి నరేష్.. ఆ జానర్ సినిమాలు బాగా ఆడుతున్నంత వరకు ఆ ఇమేజ్‌ను దాటి బయటికి రాలేదు. కానీ కామెడీ సినిమాలతో వరుస పరాజయాల తర్వాత గ్యాప్ తీసుకుని ‘మహర్షి’లో సీరియస్ క్యారెక్టర్ రోల్ చేశాడు. ఆపై లీడ్ రోల్‌లో నటించిన నాంది కూడా చాలా సీరియస్‌గా సాగింది. ఆపై ‘ఉగ్రం’లో అగ్రెసివ్ క్యారెక్టర్ ట్రై చేశాడు.

తర్వాత ‘మారేడుమిల్లి ప్రజానీకం’లో సందేశాత్మక పాత్ర.. ‘ఆ ఒక్కటి అడక్కు’లో సందేశం, కామెడీ మిళితమైన పాత్రలో కనిపించాడు. ఇప్పుడు తన కొత్త చిత్రంలో మరో కొత్త మేకోవర్ కోసం ట్రై చేస్తున్నాడు అల్లరోడు. ఈసారి అతను కెరీర్లో ఎన్నడూ చేయని ఊర మాస్ పాత్ర చేస్తున్నట్లు కనిపిస్తోంది.

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం.. బచ్చల మల్లి. ఈ రోజే ఈ సినిమా నుంచి నరేష్ ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. రిక్షాలో కూర్చుని బీడీ తాగుతున్న ఊర మాస్ అవతారంలో నరేష్ కనిపించాడు. రిక్షా వ్యవహారం చూస్తే ఇది ప్రేక్షకులను చాలా ఏళ్లు వెనక్కి తీసుకెళ్లే మూవీలా కనిపిస్తోంది. బ్యాగ్రౌండ్లో అవతారాలు చూస్తే జాతర సెటప్ గుర్తుకు వస్తోంది.

ఇంతకుముందు సాయిధరమ్ తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ తీసిన సుబ్బు మంగాదేవి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. హాస్య మూవీస్ బేనర్ మీద రాజేష్ దండ ‘బచ్చల మల్లి’ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పటిదాకా పక్కా క్లాస్ చిత్రాలకే సంగీత దర్శకుడిగా పని చేసిన విశాల్ చంద్రశేఖర్ ఈ మాస్ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

This post was last modified on May 28, 2024 2:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

టీడీపీలో మ‌రో ప‌వ‌ర్ సెంట‌ర్ అత‌డే..?

టీడీపీలో ఇప్పుడు ఒక పేరు త‌ర‌చూ వినిపిస్తోంది. ఆ పేరు 2014లో పార్టీ విజ‌యం సాధించిన‌ప్పుడూ వినిపించింది.. ఇప్పుడు 2024…

12 hours ago

సంధ్య కి షోకాజ్ నోటీసులు : వివరణ ఇవ్వకపోతే లైసెన్స్ రద్దు!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి…

12 hours ago

ఎర్రచందనం పుష్పరాజ్ – గంజాయి ఘాటీ రాణి!

వచ్చే ఏడాది ఏప్రిల్ 18 విడుదల కాబోతున్న ఘాటీ అనుష్క అభిమానులకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే పెర్ఫార్మన్స్ ఆధారంగా టైటిల్…

15 hours ago

ప్యాన్ ఇండియా వద్దు….సీనియర్ స్టార్లే ముద్దు!

కామెడీ, కమర్షియల్, యాక్షన్ ఈ మూడు అంశాలను సరైన పాళ్లల్లో కలిపి బ్లాక్ బస్టర్లు కొట్టడంలో అనిల్ రావిపూడి శైలే…

15 hours ago

రేపటి నుంచి తగ్గనున్న పుష్ప 2 టికెట్ రేట్లు!!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పుష్ప 2 ది రూల్ కి ఇచ్చిన భారీ టికెట్ రేట్ల వెసులుబాట్లు ఈ రోజుతో…

16 hours ago