జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవర పాటల సందడి మొదలైపోయింది. నాలుగేళ్లకు పైగా సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చిన టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ కావడంతో అంచనాలు మాములుగా లేవు. ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ అది మల్టీ స్టారర్ కావడంతో సోలో హీరోగా తారక్ ని చూసేందుకు అరవింద సమేత వీర రాఘవ తర్వాత ఇంత కాలం పట్టడంతో ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి. భయం థీమ్ తో వచ్చిన ఈ లిరికల్ వీడియోని రేపు జూనియర్ పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్ కానుక ఇచ్చారు.
తన ట్రెండ్ ఫాలో అవుతూ అనిరుద్ ఇందులో కూడా పాట పాడుతూ కనిపించాడు. సముద్రపు ఒడ్డున శత్రువులను ఊచకోత కొస్తున్న దేవర ని చూపిస్తూనే ఇంకోవైపు అతని జోలికి వస్తే జాగ్రత్త అంటూ హెచ్చరిక జారీ చేస్తూ పోటెత్తే అలల ప్రవాహాన్ని దేవరలో ఆవేశానికి ముడిపెట్టారు. వాయిద్యాల హోరు ఎక్కువగా ఉండటం వల్ల లిరిక్స్ అర్థం చేసుకోవడానికి కొంత టైం అయితే పడుతుంది. ఫ్యాన్స్ కోరుకున్న ఎలివేషన్లు, ఎమోషన్లు అన్నీ పండాయి కానీ మళ్ళీ మళ్ళీ వినేలా ఉందో లేదో ఓ రెండు మూడు రోజులు ఆగితే అర్థమైపోతుంది. కొరటాల మేకింగ్ వయోలెంట్ గా ఉంది.
రామజోగయ్య శాస్త్రి దేవర వ్యక్తిత్వాన్ని వర్ణించిన తీరు బాగుంది. సముద్రపు బ్యాక్ డ్రాప్ లో జరిగే సీరియస్ కథే అయినప్పటికీ అనిరుద్ కంపోజింగ్ మాస్ తో క్లాస్ టచ్ వచ్చేలా పాశ్చాత్య టచ్ ఇవ్వడం వెరైటీగా ఉంది. విజువల్స్ ద్వారా సినిమాలో కంటెంట్ ఎంత వయొలెంట్ గా ఉండబోతోందో క్లూస్ ఇచ్చారు. టీజర్ కాదు కాబట్టి క్యాస్టింగ్ రివీల్ చేయకుండా కేవలం దేవరని పరిచయం చేయడానికి ఈ పాటని వాడుకున్నారు. నాగవంశీ, విశ్వక్ సేన్ లాంటి వాళ్ళు ఊరించినట్టు ఇది హుకుంని మించిపోయేలా నిలుస్తుందో లేదో కొంత కాలం వేచి చూడాలి. అనిరుద్ సాంగ్స్ స్లో పాయిజన్ లా మెల్లగా ఎక్కుతాయి మరి.
This post was last modified on May 19, 2024 8:24 pm
మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…
ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…
కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…
2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…
ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…
యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…