నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరై తర్వాత పూర్తిగా తమిళంకే అంకితమైపోయిన భరత్ హీరో. హారర్ జానర్ కావడంతో ఎంతో కొంత వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతో థియేటర్లకు తీసుకొచ్చారు. విచిత్రం ఏంటంటే దీని ఒరిజినల్ వెర్షన్ 2022లో విడుదలయ్యింది. ఓటిటి ద్వారా అందుబాటులో ఉండగా హిందీ అనువాదం ఎంచక్కా యూట్యూబ్ లో ఉచితంగా దొరుకుతోంది. అయినా సరే ఇంత ధీమాగా ఈ మిరల్ ని మనకోసం తీసుకొచ్చారంటే అసలు మ్యాటర్ ఏముందో చూద్దాం.
ప్రేమించి పెళ్లి చేసుకున్న హరి (భరత్), రమ (వాణి భోజన్) లది అన్యోన్య దాంపత్యం. సంతానం ఒక్కగానొక్క కొడుకు సాయి (మాస్టర్ అంకిత్). ఎవరో భర్తను చంపుతున్నట్టు రమకు భయంకరమైన కలలు వస్తుంటాయి. దీనికి పరిహారంగా పెద్దల సలహా మేరకు కులదైవంకు మొక్కులు చెల్లించడం కోసం స్వగ్రామానికి వెళ్తారు. పూజలు పూర్తి చేసుకుని తిరిగి వెళ్లే క్రమంలో రమ ఊహించినట్టే నిజంగానే హరి ఫ్యామిలీ మీద దాడి జరుగుతుంది. అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇంతకీ వీళ్ళ కుటుంబం మీద దెయ్యాలు పగ పట్టేందుకు కారణాలు ఏంటనేది కథలో అసలు పాయింట్.
దర్శకుడు శక్తివేల్ కామెడీ జోలికి వెళ్లకుండా సీరియస్ హారర్ కి కట్టుబడాలనే ఆలోచన బాగుంది కానీ దాన్ని సరైన రీతిలో కట్టిపడేసేలా తీయడంలో విఫలమయ్యాడు. అరగంటకు సరిపడే లైన్ ని పూర్తి నిడివి సినిమాగా పొడిగించే క్రమంలో ఆసక్తి కలిగించని సన్నివేశాలు, రొటీన్ ఎలిమెంట్స్, బ్యాలన్స్ కుదరని పాత్రల చిత్రణతో విసిగించేశాడు. పైగా క్లైమాక్స్ ట్విస్టు ఏదో మతిపోయే రేంజ్ లో ఉంటుందని ఆశిస్తే ఆడియన్స్ ని మోసం చేసే తరహాలో ముగించడం ఎంత మాత్రం మింగుడుపడదు. ఎంత హారర్ ప్రియులైనా సరే విపరీతమైన ఓపికని డిమాండ్ చేసే మిరల్ డీసెంట్ ఛాయస్ గా నిలవలేకపోయింది.
This post was last modified on May 18, 2024 3:24 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…