Movie News

రియాక్షన్లు గమనిస్తున్నారా పూరి గారూ

నిన్న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ టీజర్ పట్ల రామ్ అభిమానుల స్పందన కాసేపు పక్కనపెడితే సగటు ప్రేక్షకులకు మాత్రం మరీ ప్రత్యేకంగా అనిపించని వైనం సోషల్ మీడియా ట్రెండ్స్ లో కనిపిస్తోంది. రెగ్యులర్ గా సినిమాలు చూసే మూవీ లవర్స్ సైతం ఏదేదో ఊహించుకున్నామని, కానీ ఇస్మార్ట్ శంకర్ టెంప్లేట్ నే వాడి దానికి సంజయ్ దత్ విలనిజం జోడించడం తప్ప ఇంకేమి అనిపించలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మాస్ కంటెంట్ పరంగా పిచ్చిపిచ్చిగా నచ్చేసిందని, ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయని చెప్పిన వాళ్ళు లేకపోలేదు. మెజారిటీ మాత్రం మొదటి క్యాటగిరీనే.

ఇవన్నీ దర్శకుడు పూరి జగన్నాథ్ గమనిస్తూనే ఉంటారు. ఎందుకంటే తరువాత ప్లాన్ చేయబోయే ప్రమోషన్లకు ఇవి చాలా కీలకం. ఇప్పటికీ లైగర్ డిజాస్టర్ ప్రభావం ఆయన మీద మార్కెట్ పరంగా బలంగా ఉంది. దాన్నుంచి బయటపడేందుకు డబుల్ ఇస్మార్ట్ ని ఆయుధంగా వాడుతున్నారు. ఇది పని చేయాలంటే ఆడియన్స్ లో ఈ మూవీ పట్ల విపరీతమైన ఎగ్జైట్ మెంట్ కలిగేలా చూసుకోవాలి. అంతే తప్ప దిమాక్ ఖరాబ్ లాంటి ట్రెండీ పదాలతో మళ్ళీ పని జరగాలంటే కుదరకపోవచ్చు. ఇంకోవైపు ట్రోలింగ్ చేస్తున్న బ్యాచులు లేకపోలేదు. ప్రతిదీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

పెద్ద సినిమాలకు ప్రీ రిలీజ్ బజ్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో గత కొంత కాలంగా చూస్తున్నాం. దీన్ని బిల్డ్ చేసుకోవడంలో ఏ మాత్రం తడబడినా ఆ ప్రభావం నేరుగా ఓపెనింగ్స్ మీద పడుతుంది. ది ఫ్యామిలీ స్టార్ మంచి ఉదాహరణ. డబుల్ ఇస్మార్ట్ లో బోలెడు విషయాలు ఉండొచ్చు. ట్రైలర్ కోసం కొన్నింటిని దాచి ఉండొచ్చు. కానీ అంచనాలు పెంచే క్రమం మాత్రం పద్దతి ప్రకారం ఉండాలి. మణిశర్మ పాటలు బజ్ విషయంలో కీలకం కాబోతున్నాయి. మొదటి భాగం విజయంలో ఈయన పాత్రను విస్మరించలేం. సో వచ్చిన ఫీడ్ బ్యాక్ కు అనుగుణంగానే పూరి ఎలాంటి స్ట్రాటజీ రాసుకుంటాడో చూడాలి.

This post was last modified on May 16, 2024 11:57 am

Share

Recent Posts

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

23 minutes ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

2 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

7 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

8 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

9 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

9 hours ago