ఒకప్పుడు వయసుతో సంబంధం లేకుండా హీరోలు తండ్రులు తాతలుగా నటించేవాళ్ళు. ఆడియన్స్ అంగీకరించేవారు. చిరంజీవి తొలినాళ్ళలోనే సింహపురి సింహం చేయడానికి కారణం ఇదే. సర్గీయ ఎన్టీఆర్ కు ఈ క్యాటగిరీలో భారీ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. వెంకటేష్ కు సూర్యవంశం లాంటి హిట్లున్నాయి. అయితే కాలక్రమేణా వచ్చిన మార్పుల వల్ల ఈ ఫాదర్ సన్ డ్యూయల్ రోల్ ఫార్ములా అంతగా వర్కౌట్ కావడం లేదు. అలాంటి కథలు రాసేవాళ్ళు తగ్గిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ ని ఆంధ్రావాలాలో కేవలం ఫ్లాష్ బ్యాక్ లో తండ్రిగా చూసేందుకే అభిమానులు ఇష్టపడలేదు. ఇదంతా గతం.
వర్తమానానికి వస్తే విజయ్ దేవరకొండ ఇప్పుడీ రిస్క్ చేయడానికి సిద్ధపడుతున్నట్టు టాలీవుడ్ టాక్. రాహుల్ సంకృత్యాయాన్ దర్శకత్వంలో రూపొందబోయే పీరియాడిక్ డ్రామాలో రౌడీ హీరో తండ్రి కొడుకుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు తెలిసింది. అయితే ఒకే ఫ్రేమ్ లో రెండు పాత్రలుగా కనిపిస్తాడా లేక శ్యామ్ సింగ రాయ్ లో ఇద్దరు నానిలను వేర్వేరుగా చూపించినట్టు రాహుల్ ఇందులో కూడా ఏమైనా ప్రయోగం చేస్తాడా అనేది వేచి చూడాలి. నెరసిన జుట్టు విజయ్ దేవరకొండలకు అంతగా నప్పదు. ఒకవేళ ఏదైనా ట్విస్టు పెట్టి రెండు రకాలుగా చూపిస్తాడేమో వేచి చూడాలి.
ది ఫ్యామిలి స్టార్ సూపర్ ఫ్లాప్ కి షాక్ తిన్న విజయ్ దేవరకొండకు ప్రస్తుతం ప్రామిసింగ్ ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న గౌతమ్ తిన్ననూరి ప్యాన్ ఇండియా మూవీ మీద మాములు అంచనాలు లేవు. రవికిరణ్ కోలాతో దిల్ రాజు నిర్మించబోయే చిత్రం కూడా డిఫరెంట్ జానరే. కొన్నేళ్లుగా బ్లాక్ బస్టర్ లేక సతమతమవుతున్న రౌడీ హీరోకి ఈ మూడు సినిమాలు చాలా కీలకం. అందుకే తొందపరపడకుండా ఎంత ఆలస్యమైనా సరే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ ఏడాది ఇంకో విడుదల ఉండకపోవచ్చు. గౌతమ్ సినిమా 2025 వేసవికి ప్లాన్ చేస్తున్నారు సితార మేకర్స్.
This post was last modified on May 11, 2024 2:09 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…