మాములుగా ఒక చిన్న సినిమా దర్శకుడు డీసెంట్ సక్సెస్ సాధించినప్పుడు అతనికి వెంటనే పెద్ద ఆఫర్లు రావడం అరుదు. రాజావారు రాణిగారుతో కిరణ్ అబ్బవరంకు మంచి డెబ్యూ ఇచ్చిన దర్శకుడు రవికిరణ్ కోలా త్వరలో విజయ్ దేవరకొండతో జట్టు కట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇవాళ అధికారిక ప్రకటన ఇచ్చారు. పూర్తి వివరాలు రౌడీ హీరో బర్త్ డే మే 9 అనౌన్స్ మెంట్ రాబోతోంది. రవికిరణ్ కోలా మొదటి చిత్రం బ్లాక్ బస్టర్ కాదు. పల్లెటూరి నేపథ్యంలో ఒక చిన్న ప్రేమకథను వినోదాత్మకంగా చెప్పాడు. కమర్షియల్ ఫలితం పక్కనపెడితే తనలో టెక్నీషియన్ ప్రపంచానికి పరిచయమయ్యాడు.
ఇప్పుడు రవికిరణ్ కోలాకు పలు సవాళ్లున్నాయి. మొదటిది విజయ్ దేవరకొండను విజయాల ట్రాక్ ఎక్కించడం. గత కొన్నేళ్లుగా సరైన హిట్టు లేక సతమవుతున్న రౌడీ హీరోకి ది ఫ్యామిలీ స్టార్ ఫలితం తీవ్రంగా నిరాశ పరిచింది. ఖుషి వసూళ్లు ఓకే కానీ కంటెంట్ కి పూర్తి స్థాయి మెప్పులు దక్కలేదు. ఇక లైగర్ సంగతి సరేసరి. ఇప్పటికీ పూరి జగన్నాధ్ దాని వల్ల జరిగిన డ్యామేజ్ ని సరిచేసుకుంటూనే ఉన్నాడు. ఆ మాటకొస్తే విజయ్ దేవరకొండకు గీత గోవిందం తర్వాత మళ్ళీ అంత పెద్ద హిట్టు పడలేదు. ముందు ఆ బాధ్యత గౌతమ్ తిన్ననూరి మీద ఉంది కానీ ఇప్పుడు రవికిరణ్ కోలా కూడా పంచుకోవాలి.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక మాములు యువకుడు వ్యవస్థని శాశించే స్థాయికి ఎలా చేరుకున్నాడనే పాయింట్ మీద రవికిరణ్ కొత్త తరహా ట్రీట్మెంట్ రాసుకున్నాడట. లైన్ వినడానికి మాములుగా అనిపించినా ఊహకందని మలుపులతో విభిన్న ప్రయత్నమనే లీక్ అయితే వస్తోంది. రవికిరణ్ ముందున్న ఇంకో ఛాలెంజ్ దిల్ రాజు నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. ఇది సరిగ్గా చేయగలిగితే మంచి భవిష్యత్తు పక్కా. అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, వేణు శ్రీరామ్ తరహా గ్యారెంటీ కెరీర్ దక్కుతుంది. సో వీలైనంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఇతర దర్శకుల మాదిరి పొరపాట్లకు తావివ్వకపోతే చాలు. సెటిలైపోవచ్చు.
This post was last modified on May 4, 2024 12:34 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…