బాలీవుడ్‍లోని బంధుప్రీతి, ఇతర దాష్టీకాలపై దండెత్తుతోన్న కంగన రనౌత్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ‘తిన్న కంచంలోనే కక్కే రకం’ అంటూ రాజ్యసభ సభ్యురాలు, అమితాబ్ భార్య జయాబచ్చన్ చేసిన వ్యాఖ్యలతో కంగన శివాలెత్తుతోంది. తన కంచంలో ఎవరూ వడ్డించలేదని, తన ‘తాలీ’ (భోజనం) తానే తయారు చేసుకున్నానని, తనకు మొదట్లో బాలీవుడ్ పెట్టిన భోజనంలో ఒక రెండు నిమిషాల క్యారెక్టర్, ఒక ఐటెమ్ సాంగ్ వుండేవని, అది కూడా హీరోతో పడుకుంటేనే ఆ మాత్రం దక్కేదని కంగన ఘాటుగా స్పందించింది.
అయినా తన కూతురికి టీనేజీలో బాలీవుడ్‍లో ఇవే కష్టాలు వచ్చినా, తన కొడుకు కూడా అష్టకష్టాలు పడి ఉరి వేసుకుని చనిపోయినా జయ ఇలా మాట్లాడేవారా అంటూ కంగన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. జనరల్‍గా కంగనకు ఎదురు మాట్లాడ్డానికి ఎవరూ సాహసించరు. ఎందుకంటే ఒక్కసారి ఆమెకు ఎదురు మాట్లాడగానే కంగన ఇలాగే స్పందిస్తూ వుంటుంది.
తేనెతుట్టెను కదపడం దేనికన్నట్టు ఆమె తమపైనే వ్యాఖ్యలు చేసినా కానీ స్పందించకుండా గమ్మున వుండిపోతుంటారు. అయితే బాలీవుడ్‍పై మీడియా చేస్తోన్న ప్రచారంతో జయ స్పందించి కంగన లాంటి ఇండస్ట్రీ మనుషులే మీడియాకు సినిమా వాళ్లను చులకన చేస్తున్నారని ఆమె పేరెత్తకుండానే ఆమె మాట్లాడారు. దానికి కంగన ఈ రేంజ్‍లో రివర్స్ ఎటాక్ చేసింది.
This post was last modified on September 16, 2020 10:07 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…