శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందుతున్న కుబేరలో నాగార్జున ప్రత్యేక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. క్యామియో తరహా అంటున్నారు కానీ నిడివి పరంగా చూసుకుంటే మల్టీస్టారర్ గానే చెప్పొచ్చని యూనిట్ టాక్. ఇందులో నాగ్ పాత్ర పోలీస్ ఆఫీసర్ గా ఒక డిఫరెంట్ షేడ్ లో ఉంటుందని తెలిసింది. పట్టుకోవడానికి ప్రయత్నించి నిరాశ చెందే ఒక విభిన్న నేపథ్యం ఉంటుందట. బ్రహ్మాండమైన తెలివి తేటలున్నా చిల్లి గవ్వ లేని స్థితి నుంచి వందల వేల కోట్లకు పడగలెత్తే కుబేర వెంటపడే ఆఫీసర్ గా నాగార్జున క్యారెక్టరైజేషన్ కొత్తగా డిజైన్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్.
ఇప్పటిదాకా నాగార్జున ఏడుసార్లు ఖాకీ దుస్తుల్లో కనిపించాడు, అరణ్య కాండ, శాంతి క్రాంతి, నిర్ణయం, రక్షణ, ఆవిడా మా ఆవిడే, శివమణి, ఆఫీసర్ సినిమాల్లో పోలీస్ గా నటించాడు. వీటిలో ఒక్క శివమణి మాత్రమే పెద్ద హిట్టు. ఓ రెండు యావరేజయ్యాయి. మిగిలినవి ఫ్లాపే. తిరిగి ఇంత గ్యాప్ తర్వాత కింగ్ ఇలా కనిపించడం ఫ్యాన్స్ కి కనువిందే. కుబేరలో రష్మిక మందన్న హీరోయిన్. నాగ్ కు ఎవరైనా జోడి ఉండేది లేనిది ఇంకా బయట పెట్టడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్స్ ఇద్దరు హీరోలతో తీస్తున్నారు శేఖర్ కమ్ముల. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది.
ఈ ఏడాది విడుదల సాధ్యాసాధ్యాల గురించి టీమ్ ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదు. ఒకవేళ సాధ్యం కాకపోతే 2025 సంక్రాంతి బరిలో దింపాలనేది నాగార్జున కోరిక. కానీ విశ్వంభర, రవితేజ-సితార బ్యానర్ ఆల్రెడీ పండగ స్లాట్ ని లాక్ చేసుకున్నాయి. అజిత్ గుడ్ బైద్ అండ్ ఆగ్లీ రేస్ లో ఉంది. అఫీషియల్ గా ఇవన్నీ ఆల్రెడీ ప్రకటించారు. సో కుబేర రావాలంటే కేవలం తెలుగే కాదు తమిళ మార్కెట్ స్థితిగతులను కూడా బేరీజు వేసుకోవాలి. డిసెంబర్ ఆప్షన్ చూస్తున్నారు కానీ మ్యాటర్ అయితే ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. అంతకన్నా ముందు వచ్చే ఛాన్స్ అయితే దాదాపుగా లేనట్టే.
This post was last modified on April 24, 2024 3:05 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…