నిన్న రజనీకాంత్ కొత్త సినిమా కూలీ టీజర్ వచ్చాక సోషల్ మీడియాతో పాటు అభిమానుల్లోనూ మిశ్రమ స్పందన కనిపిస్తోంది. టైటిల్ మంచి మాస్ ది పట్టాడు కానీ విజువల్స్ మాత్రం పాత స్టైల్ లో ఉన్నాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ కావడంతో అంచనాలు పెద్ద ఎత్తున నెలకొన్నాయి. ఇప్పటిదాకా కెరీర్ లో ఫ్లాప్ చూడని డైరెక్టర్ గా ఇతని ట్రాక్ రికార్డు మాములుగా లేదు. హిట్ అనే పదమే మర్చిపోయిన లోకనాయకుడు కమల్ హాసన్ కి విక్రమ్ రూపంలో అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఇవ్వడమే కాదు ఆయనకో కొత్త కెరీర్ ఇచ్చాడు.
కేవలం టైటిల్ రివీల్ కోసమే లోకేష్ ఈ టీజర్ ని షూట్ చేశాడనేది అర్థమైపోతోంది. కాకపోతే విఎఫ్ఎక్స్ క్వాలిటీ, రెగ్యులర్ స్టైల్ లో రజని ఒక డెన్నుకు వచ్చి విలన్ల తుక్కు రేగొట్టే సీన్ రొటీన్ గానే అనిపిస్తున్నాయి. దానికి తోడు అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంత కిక్ ఇచ్చేలా అనిపించలేదు. వీటి సంగతలా ఉంచితే ఈ వీడియోలో వినిపించిన తాతలు ముత్తాతాలు డైలాగుని 1982లో రిలీజైన రజని పాత సినిమా ‘రంగా’ నుంచి యధాతథంగా తీసుకున్నాడు లోకేష్. సన్నివేశానికి తగ్గట్టు వాడుకున్నా సరే ఎప్పుడో నలభై ఏళ్ళ నాటి వింటేజ్ సంభాషణని వాడుకోవడం ఆశ్చర్యపరిచింది.
ఇప్పటికిప్పుడు సినిమా గురించి అంచనాకు రాలేం కానీ గతంలో లీకైన న్యూస్ ప్రకారమే ఈ సినిమా బంగారం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో జరుగనుందనే క్లారిటీ అయితే వచ్చేసింది. కాకపోతే కూలి అనే పేరు ఎందుకు పెట్టారనేది మాత్రం వేచి చూడాలి. జైలర్ తర్వాత స్పీడ్ పెంచిన రజనీకాంత్ ఒకటి పూర్తవ్వడం ఆలస్యం వెంటనే మరొకటి లైన్ లో పెట్టేస్తున్నారు . ఆర్యోగం ఎంత మేరకు సహకరిస్తుందో కానీ రెండు వందల సినిమాలు పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారట తలైవా. అదంత సులభం కాదు కానీ 175వ మూవీ మాత్రం కోలీవుడ్ గర్వంగా చెప్పుకునే ల్యాండ్ మార్క్ అవ్వాలని ఫ్యాన్స్ ఆకాంక్ష.
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…