ప్రభాస్ పూజా హెగ్డే జంటగా రూపొందిన రాధే శ్యామ్ బ్లాక్ బస్టర్ అయ్యుంటే దర్శకుడు రాధాకృష్ణ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయేది. కనీసం యావరేజ్ కూడా అనిపించుకోలేకపోవడం అతని పాలిట శాపంగా మారింది. జ్యోతిష్యాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకోవడం వరకు బాగానే ఉన్నా దానికి టైటానిక్ తరహా స్క్రీన్ ప్లే జోడించబోయి ఖంగు తిన్న ఈ రెండు సినిమాల డైరెక్టర్ కు ఇప్పటికే బోలెడు గ్యాప్ వచ్చేసింది. అయితే ఇతని మీద నమ్మకంతో ఏళ్ళ తరబడి తమ బ్యానర్ లోనే లాక్ చేసుకున్న యువి క్రియేషన్స్ త్వరలోనే ఒక ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించేందుకు సిద్ధమవుతోందని సమాచారం.
దీని వెనుక రకరకాల క్యాలికులేషన్లు ఉన్నాయి. రాధాకృష్ణ మొదటి సినిమా జిల్ హీరో గోపీచంద్. తనతోనే తాజా కథని ఓకే చేయించుకున్నాడు. ఇది జరిగి నెలలు గడిచిపోయాయి కానీ ఫైనల్ గా కార్యరూపం దాల్చబోతోంది. ఇటు హీరో అటు దర్శకుడు ఇద్దరూ తనకు కావాల్సిన వాళ్లే కావడంతో ప్రభాస్ ప్రత్యేకంగా రికమండ్ చేసి మరీ ఈ కాంబోకి శ్రీకారం చుట్టించినట్టు టాక్ ఉంది. డార్లింగ్ మాటని కాదనేంత ఆలోచన యువి మేకర్స్ ఎప్పటికీ చేయరు. పైగా గోపీచంద్ హిట్టు లేక సంవత్సరాలు గడిచిపోయాయి. భీమా సైతం నిరాశపరిచింది. వసూళ్లు వచ్చాయి కానీ అతని స్టామినా కాదది.
సో ఇవన్నీ కూడి రాధే శ్యామ్ చేసిన గాయానికి ముందుగా జిల్ కలయికని రిపీట్ చేయబోతున్నాడు రాధాకృష్ణ. ఫైనల్ వెర్షన్ నెరేషన్ కూడా అయ్యిందట. ప్రస్తుతం శ్రీను వైట్ల ప్రాజెక్టులో బిజీగా ఉన్న గోపీచంద్ వేసవిలో ఫ్రీ అయిపోతాడు. ఈలోగా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని రాధాకృష్ణ రెడీ అవుతాడు. జిల్ వచ్చి తొమ్మిదేళ్లు దాటేసింది. దశాబ్దం కెరీర్ లో దర్శకుడు రెండే సినిమాలు చేయడం సంతోషించే విషయం కాదు. పోనీ అవి బాహుబలి రేంజ్ క్లాసిక్స్ అయితే వేరే విషయం. జిల్ హిట్ అనిపించుకోగా రాధే శ్యామ్ గురించి తెలిసిందే. ఈసారైనా బలంగా ప్రూవ్ చేసుకోకపోతే కష్టం.
This post was last modified on April 6, 2024 6:11 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…