సిసింద్రీ.. ఈ సినిమాను తలుచుకోగానే ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది నైన్టీస్ ప్రేక్షకులకు. అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ చిన్న పిల్లాడిగా ఉండగా.. ఓ హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో తీసిన సిసింద్రీ అప్పట్లో సూపర్ హిట్టయింది. అందులో తల్లి పాత్రలో ఆమని తనదైన ముద్ర వేసింది. నాగ్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రానికి శివనాగేశ్వరరావు దర్శకుడు. ఈ చిత్రం విడుదలై సోమవారానికి 25 ఏళ్లు పూర్తవడం విశేషం. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఆమని పాల్గొంది. ఈ సందర్భంగా ఆమని సిసింద్రీ సినిమా కోసం బుల్లి అఖిల్‌తో పని చేసిన అనుభవాలను పంచుకుంది. అఖిల్‌కు ఇప్పుడు మళ్లీ అమ్మగా నటిస్తున్నట్లు కూడా వెల్లడించింది.
సిసింద్రీ సినిమాలో అఖిల్‌కు అమ్మ పాత్ర చేయాలని నాగార్జున అడిగిన వెంటనే ఒప్పుకున్నా. చాలా కష్టపడి సిసింద్రీ చేశాం. 30 రోజుల్లో సినిమా అనుకుంటే 60 రోజులైంది. చిన్న పిల్లాడితో షూటింగ్ అంటే అలాగే ఉంటుంది. అఖిల్ పడుకున్నపుడు మేం కూడా విశ్రాంతి తీసుకునేవాళ్లం. వాడికి మూడ్ వచ్చినపుడు షూట్ చేసేవాళ్లం. అఖిల్‌కు అందరూ సహకరించారు. సిసింద్రీ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు సమయమే తెలియలేదు. నా సొంత బిడ్డ లాగే అనిపించాడు అఖిల్. నన్ను అమ్మలాగే భావించేవాడు. అమ్మా అనే అనేవాడు. ఇప్పటికీ ఎప్పుడు కలిసినా వెతుక్కుంటూ వచ్చి మాట్లాడతాడు. నన్ను అమ్మఆ అని హత్తుకుంటాడు. అంతకంటే ప్రేమ ఇంకెక్కడా లేదు. అది తలుచుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అఖిల్ చిన్నగా ఉన్నప్పుడు నాకు ఏ ఫీలింగ్ ఉందో ఇప్పుడు అదే ఉంది. ఇప్పుడు కూడా అఖిల్‌కు తల్లిగా ఓ సినిమా చేస్తున్నాను. అఖిల్‌ను ఇప్పుడు చూసినా నాకు చిన్న బాబులాగే కనిపిస్తాడు అని ఆమని చెప్పింది. బహుశా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లోనే అఖిల్‌కు అమ్మగా ఆమని నటిస్తుండొచ్చేమో.
This post was last modified on September 15, 2020 2:47 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…