Movie News

కొరటాల కృష్ణమ్మకు విముక్తి దొరికింది

దర్శకత్వం వహించకపోయినా నిర్మాణంలో భాగస్వామిగా కొరటాల శివ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న కృష్ణమ్మ ఎట్టకేలకు విడుదల తేదీని లాక్ చేసుకుంది. మే 3 థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీని టీజర్ ఏడాది క్రితం వచ్చింది. కొన్ని రోజులు వార్తల్లో నిలిచి ఆ తర్వాత ఊసు లేకుండా పోయింది. పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమా లేక ఆర్థిక కారణాలా బయటికి చెప్పలేదు కానీ హీరో సత్యదేవ్ దీని మీద గంపెడాశలు పెట్టుకున్నాడు. వరస ఫ్లాపులతో తన మార్కెట్ బాగా నెమ్మదించిన నేపథ్యంలో కృష్ణమ్మ సూపర్ హిట్ కావడం చాలా అవసరం.

కల్కి 2898 ఏడి మే 9 వాయిదా కన్ఫర్మ్ కావడంతో ఒక్కొక్కరుగా దాని ముందు వెనుక తేదీలను లాక్ చేసుకుంటున్నారు. కృష్ణమ్మ తెలివిగా మే 3 రావడం వల్ల మంచి స్లాట్ దక్కించుకుంది. వివి గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ విలేజ్ డ్రామాకు కథ కొరటాలనే అందించారట. విజువల్స్ గట్రా చూస్తే ఇంటెన్స్ రివెంజ్ కథలా కనిపిస్తోంది. నటన, స్వరం రెండింట్లోనూ హై బేస్ చూపించే సత్యదేవ్ కు ఇదైనా బ్రేక్ ఇవ్వాలి. దేవర పనుల్లో కొరటాల బిజీ కావడం కూడా కృష్ణమ్మ జాప్యానికి కారణంగా తోస్తోంది. కాల భైరవ సంగీతం, సన్నీ కూరపాటి ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.

సత్యదేవ్ కు ఇది కాకుండా మరో మూడు సినిమాలు సెట్స్ మీదున్నాయి. అవి ఫుల్ బాటిల్, జీబ్రా, గరుడ చాప్టర్ 1. కృష్ణమ్మ కనక విజయవంతమైతే వీటికి బిజినెస్ పరంగా హెల్ప్ అవుతుంది. గాడ్ ఫాదర్ లో విలన్ గా అద్భుతమైన నటన ప్రదర్శించినప్పటికీ యావరేజ్ ఫలితం వల్ల తను కోరుకున్న మైలేజ్ రాలేదు. గుర్తుందా శీతాకాలం, గాడ్సే, స్కై లాబ్, తిమ్మరుసు, గువ్వా గోరింకా ఏవీ ఆశించిన రిజల్ట్స్ ఇవ్వలేదు. ఆ మాటకొస్తే బ్లఫ్ మాస్టర్ తర్వాత అంత పేరు తీసుకొచ్చింది పడలేదు. మరి కొరటాల కలం బలం అందించిన కృష్ణమ్మ అయినా బ్రేక్ అందిస్తే అదే పదివేలు.

This post was last modified on April 5, 2024 5:08 pm

Share
Show comments
Published by
satya
Tags: Krishnamma

Recent Posts

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

20 mins ago

అల్లు అర్జున్ వివాదం ఎక్కడి దాకా

ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…

2 hours ago

కృష్ణమ్మా….ఎంత పని చేశావమ్మా

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

3 hours ago

భువనగిరి : గెలిస్తే ఒక లెక్క .. ఓడితే మరో లెక్క !

శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…

4 hours ago

ఒక‌రు తీర్థ యాత్ర‌లు.. మ‌రొక‌రు విదేశీ యాత్ర‌లు!

ఏపీలో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఒక‌వైపు తీవ్రమైన హింస చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్ర‌తిపక్ష నాయ‌కులు…

5 hours ago

పోలీసులు ఏంచేస్తున్నారు.. చంద్ర‌బాబు ఆవేద‌న‌

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, తాడిప‌త్రి ప్రాంతాల్లో చెల‌రేగిన హింస‌పై చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం…

6 hours ago