ఒక్క సినిమాతో కొందరు హీరోల తలరాత మారిపోతుంటుంది. సిద్ధు జొన్నలగడ్డ రాతను మార్చిన ఆ సినిమానే ‘డీజే టిల్లు’. అంతకుముందు అతను పదేళ్ల పాటు నటుడిగా నిలదొక్కుకోవడానికి పోరాడాడు. చాలా సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు పోషించాడు. తన పేరేంటో కూడా తెలియకుండానే రిలీజై వెళ్లిపోయిన సినిమాలు బోలెడు. ఐతే సిద్ధు హీరోగా చేసిన సినిమాల్లో తనకు మంచి పేరు తెచ్చింది ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. సిద్ధుకు స్టార్ ఇమేజ్ తెచ్చింది మాత్రం ‘డీజే టిల్లు’నే. ఈ సినిమాతో అతడికి మామూలు క్రేజ్ రాలేదు. ఈ క్రేజ్‌ను చెడగొట్టుకోకుండా.. చాలా టైం తీసుకుని దీని సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ చేశాడు. సినిమాను సరిగ్గా ప్రమోట్ చేసి.. క్రేజీ ప్రోమోలు వదిలి హైప్ పెంచాడు. ఇప్పుడు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తోంది. తొలి షో నుంచి ఎక్కడ చూసినా హౌస్ ఫుల్సే.
వీకెండ్లో ‘టిల్లు స్క్వేర్’ సాయంత్రం షోలకు టికెట్లు దొరకడం కష్టమవుతోంది. శనివారం సాయంత్రం, రాత్రి షోలు ప్యాక్డ్ హౌస్‌లతో నడిచాయి. ఆదివారం అన్ని షోలూ మంచి ఆక్యుపెన్సీలతో నడవబోతున్నాయి. సినిమా గ్రాస్ ఆల్రెడీ రూ.50 కోట్ల గ్రాస్ మార్కుకు చేరువగా ఉంది.
నిర్మాత నాగవంశీ తొలి రోజు అన్నట్లే ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ మార్కును అందుకుంటే ఆశ్చర్యం లేదు. విజయ్ దేవరకొండకు ‘గీత గోవిందం’ ఎలాగో సిద్ధుకు ‘టిల్లు స్క్వేర్’ అలాంటి సినిమా అన్నమాట. కొంచెం మార్కెట్ ఉన్న చిన్న హీరో స్థాయి నుంచి.. మిడ్ రేంజ్ హీరోల్లో టాప్‌లో ఉన్న నాని, విజయ్ దేవరకొండ, రామ్, అడివి శేష్‌ల సరసన చేరిపోయాడు సిద్ధు. తనకున్న అభిరుచికి, రైటింగ్ టాలెంట్‌కి సిద్ధు ఇంకా పెద్ద స్థాయికి చేరే అవకాశముంది. చేతిలో ఉన్న సినిమాలు కూడా బాగా ఆడితే తనకు తిరుగుండదనే చెప్పాలి.
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున 11 మంది ఎమ్మెల్యేలు విజయం దక్కించుకున్నారు. వీరిలో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…
అసెంబ్లీకి వెళ్లకుండా జగన్ కుంటి సాకులు చెబుతున్నారని, సభ అంటే గౌరవం లేని జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని…
టాలీవుడ్ బాక్సాఫీస్ మరో ఆసక్తికరమైన క్లాష్ కు సిద్ధమయ్యింది. ఆయా హీరోలకు తమ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన రెండు…
బాహుబలి స్థాయి సినిమాగా కోలీవుడ్లో ప్రచారం జరిగిన కంగువ సినిమాకు రిలీజ్ ముంగిట తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. అటు…
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
వైసీపీ అధినేత జగన్ మరో సోదరి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.. మరోసారి రం గంలోకి దిగారు.…