Movie News

సుహాస్.. ఎన్ని సినిమాలు బాబోయ్

సుహాస్ అనే న‌టుడిని మొద‌ట్లో చూస్తే కామెడీ వేషాల‌కు త‌ప్ప వేరే వాటికి సూట్ కాడు అనిపించేది. కానీ అత‌ను విల‌న్‌గా చేశాడు. హీరో అయ్యాడు. లీడ్ రోల్స్‌లో వ‌రుస‌గా మంచి మంచి సినిమాలు అందిస్తూ త‌న‌కంటూ ఒక ఇమేజ్ కూడా తెచ్చుకున్నాడు. ఓటీటీలో విడుద‌లైన‌ క‌ల‌ర్ ఫొటో మంచి స్పంద‌న తెచ్చుకున్నాక రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు అత‌డికి థియేట్రిక‌ల్ స‌క్సెస్ అందించాయి. దీంతో సుహాస్‌కు అవ‌కాశాలు వెల్లువెతుతున్నాయి.

అత‌ను ఆల్రెడీ పూర్తిచేసిన‌, ప్ర‌స్తుతం మేకింగ్ ద‌శ‌లో ఉన్న‌, త్వ‌ర‌లో సెట్స్ మీదికి వెళ్ల‌బోతున్న సినిమాలు అర‌డ‌జ‌నుకు పైగా ఉండ‌డం విశేషం. ఆల్రెడీ ప్ర‌స‌న్న వ‌ద‌నం అనే సినిమా వేస‌వి విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. కొత్త‌గా శ్రీరంగ‌నీతులు అనే సినిమా కూడా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ఇక ఈ మ‌ధ్యే కీర్తి సురేష్ జోడీగా సుహాస్ అమేజాన్ ప్రైమ్ కోసం ఓ సినిమా చేయ‌బోతున్న విష‌యం వెల్ల‌డైంది. అలాగే సందీప్ రెడ్డి బండ్ల అనే కొత్త ద‌ర్శ‌కుడితో చేస్తున్న సినిమా ఒక‌టి ఉంది. ఇవి కాక కొత్త‌గా సుహాస్ హీరోగా ఓ సినిమా ప్రారంభ‌మైంది. ఆ చిత్రం పేరు.. ఓ భామ అయ్యో రామ‌. రామ్ గోదాల అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్నాడు. రెండు కొత్త నిర్మాణ సంస్థ‌లు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నాయి.

ఓటీటీలో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన త‌మిళ చిత్రం జో మూవీతో అంద‌రి దృష్టిలో ప‌డ్డ మాళ‌విక మ‌నోజ్ ఈ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగు పెడుతోంది.ఈ మ‌ల‌యాళ అమ్మాయికి సోష‌ల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇది ప‌క్కా ప్రేమ‌క‌థా చిత్రం అనే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. మొత్తానికి వ‌రుస‌గా సినిమాలు చేస్తూ సుహాస్ బిజీ న‌టుడిగా మారిపోతున్నాడు.

This post was last modified on March 31, 2024 7:44 am

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

6 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

6 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

6 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

7 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

8 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

8 hours ago