వేదళాం చిత్రాన్ని రీమేక్ చేయాలని చిరంజీవి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని రీమేక్ చేసే బాధ్యతను మెహర్ రమేష్‍కు అప్పగించారనేది కూడా తెలిసిన సంగతే. చిరంజీవి ఇంకా అధికారికంగా ఆ విషయం ప్రకటించకపోయినా, చిరంజీవితో మెహర్ సినిమా వుంటుందని పవన్ కళ్యాణ్ ఖరారు చేసేసాడు. అయితే ఈ రీమేక్ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై ఇంకా స్పష్టమయిన సమాచారం లేదు. ముందుగా ఆచార్య షూటింగ్ పూర్తి చేసిన తర్వాతే చిరంజీవి తదుపరి చిత్రం గురించి కాల్ తీసుకుంటారు. ఇదిలావుంటే వేదళాం రీమేక్‍ని వీలయినంత క్రేజీగా మలిచేందుకు మెహర్ రమేష్ మంచి సపోర్టింగ్ కాస్ట్ కోసం చూస్తున్నాడు.
ఆ చిత్రంలో హీరో చెల్లెలి పాత్ర చాలా కీలకం. ఒరిజినల్‍లో లక్ష్మి మీనన్ ఆ క్యారెక్టర్ చేసింది. తెలుగు వెర్షన్లో సాయి పల్లవితో ఆ పాత్ర చేయిస్తే సినిమాకి క్రేజ్ పెరుగుతుందని భావిస్తున్నారట. అయితే చాలా సెలక్టివ్‍గా సినిమాలు చేసే సాయి పల్లవి హీరో చెల్లెలి పాత్ర చేయడానికి ఓకే అంటుందా అనేది అనుమానమే. కాకపోతే చిరంజీవి సినిమాలో నటించే అవకాశం కాబట్టి ఆమె ఈ ఆఫర్‍ని కన్సిడర్ చేయవచ్చు. ఎన్నో ఏళ్లుగా దర్శకత్వానికి దూరమయిన మెహర్ రమేష్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్క్రిప్ట్ పరంగా కూడా చాలా ఎఫర్టస్ పెడుతున్నాడట.
This post was last modified on September 12, 2020 10:44 pm
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…