ఓవైపు బాలీవుడ్లో, మరోవైపు శాండిల్‌వుడ్లో డ్రగ్స్ అంశం కొన్ని రోజులుగా కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. కన్నడ సినీ పరిశ్రమ విషయానికి వస్తే.. డ్రగ్స్ రాకెట్‌తో సంబంధముందన్న ఆరోపణలతో హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వీరి ఆర్థిక వ్యవహారాల గురించి ఆరా తీస్తే ఒక్కొక్కరికి ఉన్న ఆస్తుల గురించి తెలిసి పోలీసులకు దిమ్మదిరిగిపోయిందట. ముఖ్యంగా సంజన ఆస్తులు వారికి విస్మయం కలిగించినట్లు స్థానిక మీడియా రిపోర్ట్ చేస్తోంది. బెంగుళూరు నగరంలో పదికి పైగా ఖరీదైన ఫ్లాట్లు సంజన పేరిట ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైందట.
సంజన కన్నడతో పాటు తెలుగు, తమిళంలోనూ నటించింది. కానీ ఆమె అన్ని చోట్లా చిన్నా చితకా సినిమాలే చేసింది. తెలుగులో చేసిన పెద్ద సినిమా బుజ్జిగాడులో కూడా ఆమెది సైడ్ రోలే. ఇలాంటి కథానాయిక సినిమాల ద్వారా ఎంత ఆదాయం సంపాదించి ఉండొచ్చని అంచనా వేస్తే.. దానికి, తన పేరిట ఉన్న ఆస్తులకు అసలు పొంతనే లేదట. ఈ నేపథ్యంలో డ్రగ్ రాకెట్లో భాగం కావడం ద్వారా సంజన ఈ ఆస్తులు సంపాదించిందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా సంజనను డ్రగ్ టెస్టు కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించింది. తనను బకరాను చేశారంటూ అక్కడ పోలీసులపై విరుచుకుపడింది. సంజనతో పాటు రాగిణిని వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు పరిచిన పోలీసులు తదుపరి విచారణ కోసం వారిని తమ కస్టడీలోకి తీసుకున్నారు.
This post was last modified on September 12, 2020 10:21 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…