నితిన్ అతి పెద్ద హిట్స్ లో ఒకటి ఇష్క్. దర్శకుడు విక్రమ్ కె కుమార్ ని మెయిన్ లీగ్ లోకి తీసుకొచ్చింది ఈ సినిమానే. ఇది చూసే నాగార్జున పిలిచి మరీ మూడు తరాల అక్కినేని మూవీ మనంని ఆయన చేతుల్లో పెట్టారు. అది ఎంత పెద్ద బ్లాక్ బస్టరో మళ్ళీ చెప్పనక్కర్లేదు. 2012 తర్వాత నితిన్ విక్రమ్ కాంబినేషన్ సాధ్య పడలేదు. మళ్ళీ ఈ కలయిక కార్యరూపం దాల్చనుంది. హనుమాన్ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసిన నిరంజన్ రెడ్డి నిర్మాణంలో భారీ బడ్జెట్ తో రూపొందనుంది. ప్రస్తుతానికి ఇంతకు మించి ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ లేవు.
కాకపోతే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. విక్రమ్ కుమార్ నాగచైతన్యతో చేసిన థాంక్ యు డిజాస్టర్ ఫలితం ఆయన్ని డిఫెన్స్ లో పడేసిన మాట వాస్తవం. కనీసం యావరేజ్ కాకపోవడం చైతు ఫ్యాన్స్ ని కలవరపరిచింది. అంతకు ముందు నాని గ్యాంగ్ లీడర్, అఖిల్ హలో ఆశించిన ఫలితాలు అందుకోలేదు. అయితే దూత వెబ్ సిరీస్ మంచి పేరు తేవడం ఊరట కలిగించింది. ఈ ట్రాక్ రికార్డుని పట్టించుకోకుండా నితిన్ మళ్ళీ ఆఫర్ ఇవ్వడం మంచి విషయమే. వరస ఫ్లాపులు ఉన్న టైంలో ఇష్క్ ద్వారా మంచి బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ గా విక్రమ్ కుమార్ మీద నమ్మకముండటం సబబే.
నితిన్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ తో తమ్ముడు చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో ఎక్కువ హడావిడి లేకుండా షూట్ జరుపుకుంటోంది. వేసవిలో విడుదలకు చూస్తున్నారు కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వెంకీ కుడుములతో రాబిన్ హుడ్ ఇంకా వేగమందుకోలేదు. ఈ రెండు పూర్తయ్యి రిలీజ్ జరుపుకునేలోగా ఈ ఏడాది పూర్తవుతుంది. అంతలోపు విక్రమ్ కుమార్ ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేసేసి టైంని బట్టి సెట్స్ పైకి వెళ్తారు. అయితే ఇది ఇష్క్ 2 కాదట. పూర్తిగా వేరే జానర్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆయన స్టైల్ స్క్రీన్ ప్లేతో ఉంటుందని ఇన్ సైడ్ టాక్. చూడాలి మరి.
This post was last modified on March 18, 2024 12:46 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…