టాలీవుడ్ బాక్సాఫీస్ ప్రస్తుతం చాలా డల్లుగా నడుస్తోంది. ఫిబ్రవరిలో స్లంప్ చూసిన బాక్సాఫీస్‌కు మార్చిలో కూడా ఆశించిన ఊపు రాలేదు. తొలి వారం డల్లుగా నడిచింది. రెండో వారం ‘గామి’, భీమా’, ‘ప్రేమలు’ కొంచెం ఊపు తెచ్చినట్లే కనిపించాయి. దీంతో వేసవి సందడి ముందే మొదలైందని అనుకున్నారు. కానీ వాటి జోరు వీకెండ్ వరకే పరిమితం అయింది.
ఇక మూడో వీకెండ్లో వచ్చిన సినిమాల గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. పేరుకు రెండంకెల సంఖ్యలో సినిమాలు రిలీజయ్యాయి కానీ.. ఏవీ ప్రభావం చూపలేదు. ‘రజాకార్’ సహా అన్నీ బాక్సాఫీస్ దగ్గర వాషౌట్ అయినట్లే కనిపించాయి. ముందు వారం వచ్చిన సినిమాలనే జనం ఓ మోస్తరుగా చూస్తున్నారు తప్ప.. కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోవడం లేదు.
ఐతే ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు ముగించుకుని సినిమాలకు రెడీ అయిపోతున్నారు. రెగ్యులర్ సినీ గోయర్స్ కూడా కొత్త క్రేజీ మూవీస్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి టైంలో ‘ఓం భీం బుష్’ లాంటి క్రేజీ మూవీ రాబోతోంది. సినిమా మంచి టైమింగ్‌లో రిలీజ్ కాబోతోంది. వచ్చే శుక్రవారం రానున్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. దీని టీజర్, ట్రైలర్ యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ వారం మరి కొన్ని సినిమాలు కూడా రాబోతున్నప్పటికీ ప్రధానంగా అందరి దృష్టీ ‘ఓం భీం బుష్’ మీదే ఉండబోతోంది.
యువ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసే క్రేజీ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది ‘ఓం భీం బుష్’. ప్రమోషన్లు కూడా టీం కొంచెం గట్టిగా చేస్తోంది. యువి క్రియేషన్స్ రిలీజ్ అంటే గట్టిగానే ఉంటుంది. ఈ సినిమాతోనే వేసవి సీజన్ మొదలవుతుందని భావిస్తున్నారు. తర్వాతి వారం రానున్న ‘టిల్లు స్క్వేర్’ మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి.
This post was last modified on March 17, 2024 6:46 pm
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…