Movie News

రెండు సందేహాలకు చెక్ పెట్టనున్న బన్నీ

వచ్చే నెల ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు. అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. మీడియాలో, ఫ్యాన్స్ లో నెలకొన్న రెండు ముఖ్యమైన సందేహాలకు ఆ రోజు స్పష్టమైన సమాధానం దొరకబోతోంది కాబట్టి. మొదటిది పుష్ప 2 ది రూల్ విడుదల తేదీ. చాలా స్పష్టంగా ఆగస్ట్ 15 అని మైత్రి మేకర్స్ స్పష్టంగా చెబుతున్నప్పటికీ వాయిదా ప్రచారాలు ఆగడం లేదు. అందుకే ఒక స్పెషల్ టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ని నొక్కి వక్కాణిస్తూ కొత్త కంటెంట్ ని వదులుతారని తెలిసింది. దీని కోసం పోస్టర్ల డిజైన్ కూడా జరుగుతోందని వినికిడి.

ఇక రెండోది పుష్ప తర్వాత ఎవరితో చేస్తాడనే మ్యాటర్. దర్శకుడు అట్లీతో ప్రాజెక్ట్ ఓకే అయ్యిందనే వార్త రెండు మూడు రోజులుగా చక్కర్లు కొడుతూనే ఉంది. పైగా స్టోరీ సిట్టింగ్స్ వీడియో బయటికి వచ్చింది. మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్లాన్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీ సంగతేంటనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇది ఆలస్యమయ్యే పక్షంలో కనీసం ప్రొడక్షన్ హౌస్ నుంచి విషెస్ చెబుతూ ఒక పోస్టర్ లాంటిది వస్తే అనుమానాలు ఉండవు. పుష్ప 3 ది రోర్ గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ ఉండకపోవచ్చు. అసలు మూడో భాగం ఉంటుందో లేదో అఫీషియల్ గా తెలిసే ఛాన్స్ ఇప్పట్లో లేదు.

పుష్ప 2 విడుదల సంవత్సరం కాబట్టి ప్రత్యేకంగా జరపాలని ఆయా యూనిట్లు ప్లాన్ చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా దీని షూటింగ్ లోనే బిజీగా ఉన్న బన్నీ ఆగస్ట్ తర్వాత ఓ నాలుగు నెలలు బ్రేక్ తీసుకుని కొత్త సినిమా సెట్లో అడుగు పెడతాడని సమాచారం. నాలుగేళ్లుగా ఒకే హెయిర్ స్టైల్ ని కొనసాగించి బాగా స్ట్రైన్ తీసుకున్న అల్లు అర్జున్ కొత్త మేకోవర్ కు మారిపోవాలంటే ఆ మాత్రం సమయం అవసరమే. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చబోయే అట్లీ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్, టెక్నికల్ టీమ్ తదితర వివరాలు రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా వెల్లడి కాబోతున్నాయి.

This post was last modified on March 15, 2024 12:43 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

3 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

3 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

4 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

4 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

5 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

5 hours ago