ఓటిటి కోసం మ.మ. అనిపించేసారు!

సాయి ధరమ్‍ తేజ్‍ కొత్త సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్‍’ ఓటిటి ద్వారా విడుదల కానుందనే సంగతి విదితమే. జీ 5 ఈ చిత్రం డిజిటల్‍తో పాటు థియేట్రికల్‍ హక్కులను కూడా సొంతం చేసుకుంది. అక్టోబర్‍లో విడుదల చేసుకునేలా తమకు కంటెంట్‍ అప్పగించాలనే కండిషన్‍ పెట్టడంతో కరోనాని లెక్క చేయకుండా పరిమిత బృందంతో బ్యాలెన్స్ షూటింగ్‍ చేసేసారు.

అయితే రెండు పాటలు కూడా తీయాల్సి వుండగా, ఎలాగో ఓటిటి రిలీజ్‍ కాబట్టి ఇక వాటి అవసరం లేదని భావించి ఆ పాటల చిత్రీకరణ చేయలేదని సమాచారం. ఈ సినిమా షూటింగ్‍ పూర్తయిందనే సంగతి సాయి ధరమ్‍ తేజ్‍ అఫీషియల్‍గా ప్రకటించాడు. మాస్క్ లు వేసుకుని షూటింగ్‍ చేసినపుడు, వేసుకోకుండా చేసినపుడు కూడా చాలా ఎంజాయ్‍ చేశానని అన్నాడు. ఈ చిత్రం రిలీజ్‍ సంగతి మాత్రం ఈ టీమ్‍ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు.

జీ 5 నుంచి కూడా సోలో బ్రతుకే సో బెటర్‍ డిజిటల్‍ రిలీజ్‍ గురించిన ఇన్‍ఫర్మేషన్‍ లేదు. బహుశా మంచి రోజు చూసుకుని అధికారిక వార్తతో వద్దామని భావిస్తున్నారేమో. తేజ్‍ సరసన నభా నటేష్‍ హీరోయిన్‍గా నటించిన ఈ చిత్రానికి తమన్‍ సంగీత దర్శకుడు, సుబ్బు అనే కొత్త కుర్రాడు దర్శకుడు.