ఈ ఫోటో చూసిప్రకాష్ రాజ్ ఏడిచేశాడంట

Prakash Raj

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ యాక్టింగ్ లోనే కాదు దర్శకుడిగానూ తన అభిరుచిని ధోని, ఉలవచారు బిర్యానీ లాంటి చిత్రాల ద్వారా చూపించారు. పెద్ద విజయాలు అందుకోలేదు కానీ డైరెక్టర్ గా ఆయన టాలెంట్ ప్రపంచానికి పరిచయమయ్యింది. నిర్మాతగానూ తన అభిరుచి అలాంటిదే. ఉత్సవ్ గోన్వర్ అనే దర్శకుడు ఇటీవలే కన్నడలో ఫోటో అనే చిన్న సినిమా తీశాడు. ఢిల్లీ హ్యబిటట్ అంతర్జాతీయ చిత్రోత్సవం, బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో దీన్ని ప్రీమియర్ చేసినప్పుడు ఆడియన్స్ షో అయ్యాక లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. వాళ్లలో ప్రకాష్ రాజ్ ఉన్నారు.

దీన్ని థియేటర్ ఆడియన్స్ కి చేరువ చేయాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నారు. వెంటనే రంగంలోకి దిగి తన సమర్పణలో మార్చి 15 విడుదల చేసేందుకు పూనుకున్నారు. మాములుగా దాని ఒరిజినల్ నిర్మాతకు అంత స్థోమత లేదు. ఒకవేళ వసూళ్ల పరంగా ఏదైనా తేడా వస్తే తట్టుకోవడం కష్టం. కానీ ప్రకాష్ రాజ్ కు ఆ సమస్య లేదు. లాక్ డౌన్ ప్రకటించినప్పుడు ఏర్పడిన దయనీయ పరిస్థితుల ఆధారంగా ఒక చిన్న పిల్లాడి సెంటిమెంట్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. క్లైమాక్స్ గుండెలు పిండేసేలా ఉంటుంది. అంతగా కదిలించింది కాబట్టి ప్రకాష్ రాజ్ కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది.

ప్రస్తుతానికి కన్నడలో మాత్రమే తీసుకొస్తున్నారు. అక్కడ సక్సెస్ అయితే తెలుగుతో పాటు ఇతర భాషల్లో డబ్బింగ్ లేదా రీమేక్ చేసే ఆలోచనలు జరుగుతున్నాయి. అయితే లాక్ డౌన్ ట్రాజెడీని జనాలు మర్చిపోయిన నేపథ్యంలో ఆ బ్యాక్ డ్రాప్ తో చేసిన సినిమా ఏ మేరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. ఆ మధ్య రాజేంద్రప్రసాద్ హీరోగా అనుకోని ప్రయాణం ఇలాంటి తరహాలో ఒక ఆఫ్ బీట్ మూవీ తీశారు కానీ డబ్బులు రాలేదు. కానీ ఫోటో విషయంలో మాత్రం ప్రకాష్ రాజ్ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఖచ్చితంగా మెప్పిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఆయన కాన్ఫిడెన్స్ ఎంత నిజమో చూడాలి మరి.