టాలీవుడ్ కు భరత్ అనే నేనుతో పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని ఆ తర్వాత తెలుగులో చేసిన సినిమా వినయ విధేయ రామ ఒక్కటే. డెబ్యూ సూపర్ హిట్టయ్యింది కానీ రెండోది డిజాస్టర్ కావడంతో హిందీ ఆఫర్లకే పరిమితమయ్యింది. చాలా గ్యాప్ తీసుకుని తిరిగి గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ తో జోడి కట్టింది. వార్ 2లో ఆఫర్ కన్ఫర్మ్ అయ్యింది కానీ తాను నటించేది హృతిక్ రోషన్ పక్కనా లేక జూనియర్ ఎన్టీఆర్ సరసనా అనేది బయటికి రాలేదు. ఇదిలా తాజాగా డాన్ 2లో రణ్వీర్ సింగ్ తో చేయనున్న కియారా పారితోషికం వింటే చుక్కలు చూడాల్సిందేనని బాలీవుడ్ టాక్.
ముంబై వర్గాల ప్రకారం డాన్ 2 కోసం కియారా అద్వానీ తీసుకున్న రెమ్యునరేషన్ 13 కోట్లట. తన కెరీర్ లోనే ఇది అత్యధిక మొత్తంగా చెబుతున్నారు. ముందు కృతి సనన్ ని అనుకున్నప్పటికీ రన్వీర్ సింగ్ ప్రత్యేకంగా రికమండ్ చేయడంతో కియారాని లాక్ చేసినట్టు ఇన్ సైడ్ న్యూస్. ఇందులో సగమే వార్ 2కి ఇచ్చినా, అంతకన్నా కొంత తక్కువ గేమ్ ఛేంజర్ కు పుచ్చుకున్నా ప్రత్యేకంగా డాన్ 2కి ఎక్కువ ఆఫర్ చేయడం వెనుక కారణం భారీ కాల్ షీట్స్ అవసరం ఉండటమేనని సమాచారం. అధికారికంగా చెప్పింది కాకపోయినా అక్కడి మీడియా వర్గాల్లో ఇదో హాట్ టాపిక్ గా మారింది.
నెమ్మదిగా వెళ్తున్నా స్టార్ స్టేటస్ వైపు పరుగులు పెడుతున్న కియారాకు క్రేజీ అవకాశాలు రావడం చూస్తే అనఫీషియల్ గా నెంబర్ వన్ స్థానంలో కూర్చున్నట్టే అని చెప్పొచ్చు. విచ్చలవిడి గ్లామర్ షోకు ఒప్పుకోకపోయినా కథ డిమాండ్ మేరకు వెసులుబాటు ఇచ్చే కియారాని సరికొత్తగా డాన్ 3లో చూడొచ్చని అంటున్నారు. గేమ్ ఛేంజర్ లో తన భాగం వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న కియారాతో ఇంకొంత ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ మీద అమ్మడు భారీ ఆశలు పెట్టుకుంది. దర్శకుడు శంకర్ నటనకు ప్రాధాన్యం ఉండేలా పాత్ర ఇచ్చారట.
This post was last modified on March 4, 2024 5:44 pm
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…