Movie News

కెరీర్లను తేల్చబోతున్న మార్చి నెల

కొత్త ఏడాదిలో సంక్రాంతి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్‌లో ఆశించిన సందడి లేదు. ఫిబ్రవరి సినిమాల్లో ఏదీ పూర్తి సంతృప్తినివ్వలేదు. అంబాజీపేట మ్యారేజీబ్యాండు, ఈగల్, ఊరు పేరు భైరవకోన అంచనాలను అందుకోలేకపోయాయి. ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయాయి. మిగతా సినిమాల గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఇక ఫోకస్ మార్చి నెల పైకి మళ్లబోతోంది. ఆ నెలలో క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. వాటిలో ఓ మూడు చిత్రాలు వాటి హీరోల కెరీర్లకు అత్యంత కీలకం కాబోతున్నాయి. మేక్ ఆర్ బ్రేక్ అన్నట్లుగా ఉంది ఆ హీరోల పరిస్థితి. ముగ్గురు పేరున్న హీరోలు కమ్ బ్యాక్ ఆశిస్తున్న ఆ చిత్రాలే.. ఆపరేషన్ వాలెంటైన్, భీమ, ఆ ఒక్కటీ అడక్కు. వరుణ్ తేజ్, గోపీచంద్, అల్లరి నరేష్‌ల కెరీర్లకు ఈ చిత్రాలు ఎంతో కీలకం. ఇవి అటు ఇటు అయితే వారి కెరీర్‌కు చాలా ఇబ్బందిగా మారుతుంది.

ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్-2 లాంటి సూపర్ హిట్లతో ఒక టైంలో మంచి ఊపు మీద కనిపించాడు వరుణ్ తేజ్. కానీ రెండేళ్లుగా అతడికి ఏదీ కలిసి రావడం లేదు. గని, ఎఫ్-3, గాండీవధారి అర్జున.. ఇలా వరుసగా ఫెయిల్యూర్లు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ‘ఆపరేషన్ వాలెంటైన్’ హిట్ కావడం అతడికి చాలా అవసరం. వరుణ్ తొలిసారి హిందీలోనూ నటించిన చిత్రమిది. విడుదలకు ముందు ఈ సినిమాకు హైప్ తక్కువే ఉ:ది. కానీ కంటెంట్ మీద చాలా నమ్మకంగా ఉన్న వరుణ్.. ఈ చిత్రం తనకు సక్సెస్ అందిస్తుందని ఆశిస్తున్నాడు. ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

తర్వాతి వారం రిలీజయ్యే ‘భీమ’ గోపీచంద్‌కు ఎంత కీలకమో చెప్పాల్సిన పని లేదు. గత ఏడాది గోపీ నుంచి వచ్చిన ‘రామబాణం’ పెద్ద డిజాస్టర్ అయింది. ఈసారి అతను కన్నడ దర్శకుడు హర్షతో జట్టు కట్టాడు ‘భీష్మ’ కోసం. గోపీ మార్కు పక్కా మాస్ మూవీలా కనిపిస్తున్న ‘భీమ’ ఏమవుతుందో చూడాలి.

ఇక ఒకప్పుడు కామెడీ చిత్రాలతో కడుపుబ్బ నవ్వించి, ఆ తర్వాత ఆ సినిమాలే కలిసి రాక సైడ్ అయిపోయాడు అల్లరి నరేష్. కొంచెం గ్యాప్ తర్వాత అతను ‘నాంది’ అనే సీరియస్ సినిమాతో హిట్ కొట్టాడు. కానీ ఆ తర్వాత అదే శైలిలో చేసిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం ఆడలేదు. దీంతో మళ్లీ పాత స్టయిల్లో ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే కామెడీ సినిమా చేశాడు. దీంతో మళ్లీ తనకు కామెడీ ఇమేజ్ తిరిగొస్తుందని.. తనకు పూర్వ వైభవం తెస్తుందని ఆశిస్తున్నాడు నరేష్. మరి అతడికి కూడా మార్చి నెల మంచి కమ్ బ్యాక్ ఇస్తుందేమో చూడాలి.

This post was last modified on February 25, 2024 2:50 pm

Share
Show comments

Recent Posts

థియేటర్ అనుభూతి డిమాండ్ చేసే రీ-రిలీజ్

కొన్ని సినిమాలు ఖచ్చితంగా థియేటర్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేస్తాయి. వాటిని ఓటిటిలో చూసినా, టీవీలో వీక్షించినా అంత కిక్…

4 hours ago

జీవితంలో ఫ‌స్ట్ టైమ్‌: చంద్ర‌బాబు

త‌న రాజ‌కీయ జీవితంలో విజ‌య‌వాడ‌లో సంభ‌వించిన స్థాయి వ‌ర‌ద‌ల‌ను చూడ‌డం ఇదే తొలిసార‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. వాతావ‌ర‌ణంలో చోటు…

10 hours ago

OG ప్రస్తావన కావాలనే తెచ్చారా

తాజాగా విడుదలైన ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం క్లైమాక్స్ అయిపోయాక హాలీవుడ్ తరహాలో ఎండ్ టైటిల్స్ తర్వాత చిన్న…

10 hours ago

పాపం మీనాక్షి….మరోసారి అన్యాయం

టాలీవుడ్ లో ఎక్కువ అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ముందు వరసలో ఉంది. ఈ ఏడాది కనీసం అయిదు…

11 hours ago

రంగంలోకి ఆర్మీ.. బుడ‌మేరు గండ్ల పూడ్చివేత‌: కేంద్ర మంత్రి

ఏపీలో బ‌డుమేరు స‌హా కృష్ణాన‌ది వ‌ర‌ద ప్ర‌భావంతో మునిగిపోయిన ప్రాంతాల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. అయితే.. ఎంత…

12 hours ago

సీఎం చంద్ర‌బాబుకు త‌ప్పిన ముప్పు..!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. విజ‌య‌వాడ‌లో బుడ‌మేరు పొంగిపోవ‌డంతో ఆయ‌న బాధిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్న విష‌యం…

14 hours ago