గత కొన్నేళ్లలో తెలుగు సినిమాల్లో ప్రత్యేకమైన ముద్ర వేసిన నిర్మాతల్లో సుధాకర్ చెరుకూరి ఒకరు. నిర్మాతగా ఆయన సక్సెస్ రేట్ గొప్పగా లేదు కానీ.. వైవిధ్యమైన చిత్రాలతో ఆయన తన అభిరుచిని చాటుకున్నాడు. నిర్మాతగా కమర్షియల్ లెక్కలేసుకోకుండా సినిమాలు తీశారీయన. కానీ బాక్సాఫీస్ మాత్రం ఆయనకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. పడి పడి లేచె మనసు, ఆడవాళ్ళు మీకు జోహార్లు, విరాటపర్వం, రామారావు ఆన్ డ్యూటీ.. ఇలా ఇప్పటిదాకా సుధాకర్ బేనర్ నుంచి వచ్చిన నాలుగు చిత్రాలూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి.
వీటి తర్వాత ‘దసరా’ సినిమాకు ఆయనకు చావో రేవో అన్నట్లుగా తయారైంది. ఐతే గత ఏడాది వేసవిలో విడుదలైన ఈ నాని సినిమా సుధాకర్‌కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. టేబుల్ ప్రాఫిట్‌తో సినిమాను రిలీజ్ చేసిన ఆయనకు.. ఓవర్ ఫ్లోస్ రూపంలోనూ ఆదాయం వచ్చింది.
దసరా తర్ావత నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లోనే ఇంకో సినిమా కోసం ట్రై చేస్తున్నాడు సుధాకర్. ఈలోపు ఒక కొత్త సినిమాను ప్రకటించాడు సుధాకర్. దాదాపుగా అందరూ కొత్త వాళ్లతో చేస్తున్న సినిమా ఇది. కన్నడలో బిగ్ హిట్ అయిన ‘దియా’తో హీరోగా పరిచయం అయి.. ‘దసరా’ హీరో ఫ్రెండుగా కీలక పాత్రలో ఆకట్టుకున్న దీక్షిత్ శెట్టి ఇందులో హీరో. శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెల ఇందులో మరో ముఖ్య పాత్ర చేస్తున్నాడు.
‘రంగబలి’లో తన అందంతో ఆకట్టుకున్న యుక్తి తరేజా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు ‘కింగ్ జాకీ క్వీన్’ అనే వెరైటీ టైటిల్ పెట్టారు. కేకే అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ రోజే ముఖ్య పాత్రల పరిచయంతో ఒక టీజర్ వదిలారు. అది చూస్తే మంచి క్వాలిటీ కనిపిస్తోంది. ఇదొక క్రైమ్ సినిమాలా ఉంది. టీజర్‌తో బాగానే ఇంప్రెస్ చేసిన ‘క్వీన్ జాకీ క్వీన్’ సినిమాగాా ఎలా మెప్పిస్తుందో చూడాలి.
This post was last modified on February 20, 2024 5:35 pm
హరిహర వీరమల్లు షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేయడంతో ఇప్పుడు అభిమానుల చూపు ఓజి వైపు వెళ్తోంది. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు…
తెలుగు రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు…
తెలుగు రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రచించిన వ్యూహం ఫలించింది. ఫలితంగా మంగళవారం అర్థరాత్రి నుంచి జరగనున్న ఆర్టీసీ సమ్మె…
సీఎంగా రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలన్న కాంక్షతో వడివడిగా ముందుకు సాగుతున్న చంద్రబాబు.. అదే సమయంలో తాను తీసుకుంటున్న నిర్ణయాల్లో వచ్చే…
తెలంగాణలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ల మధ్య మరోమారు మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ప్రత్యేకించి సీఎం ఎనుముల…