గత ఏడాది విరూపాక్ష సూపర్ హిట్ తో కంబ్యాక్ అందుకున్స్ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా గాంజా శంకర్ ఆగిపోయిందనే వార్తల నేపథ్యంలో నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అఫీషియల్ క్లారిటీ రాకపోవడంతో అభిమానులు కొంత అయోమయంలో ఉన్నారు. సంపత్ నంది దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్టుని పెద్ద బడ్జెట్ తోనే ప్లాన్ చేసుకున్నారు. దీని సంగతలా ఉంచితే తేజు, కలర్స్ ఫేమ్ స్వాతి రెడ్డి నటించిన షార్ట్ ఫిలిం సత్య వరసగా ఇంటర్నేషనల్ అవార్డులు గెలుస్తూ అంతకంతా స్థాయిని పెంచుకుంటూ పోతోంది.
తాజాగా ఫ్రాన్స్ లో జరిగిన టౌలౌజ్ షార్ట్స్ ఫెస్ట్ లో ఏకంగా ఎనిమిది పురస్కారాలు అందుకుంది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ శబ్ద గ్రహణం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, నిర్మాత, డెబ్యూ డైరెక్టర్, ఇండీ షార్ట్ ఇలా ఈ క్యాటగిరీలన్నిటిలోనూ విజేతగా నిలిచింది. దర్శకుడు నవీన్ విజయ్ కృష్ణకు దీని తర్వాత మంచి ఆఫర్లు వస్తున్నాయట. ఆ మధ్య మంత్ అఫ్ మధుతో ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేసిన కలర్స్ స్వాతి దానితో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. కానీ ఇప్పుడీ సత్యకు వస్తున్న స్పందన చూసి సంతోషంగా ఫీలవుతోంది. సత్యకు న్యూయార్క్ లో రెండు ఓనిరోస్ అవార్డులు దక్కాయి.
ఆగస్ట్ లో విడుదల చేసిన లిరికల్ వీడియో తప్ప ఇంకా ఫుల్ మూవీని టీమ్ రిలీజ్ చేయలేదు. త్వరలో ప్లాట్ ఫార్మ్ డిసైడ్ చేసి ప్రకటిస్తారు. మెసేజ్ ఓరియెంటెడ్ ఎమోషన్స్ తో రూపొందిన సత్యకు ఇంత గుర్తింపు వచ్చిందంటే కంటెంట్ బలంగా ఉందన్న మాట. ఇప్పుడే కాదు సాయిధరమ్ తేజ్ గతంలో సామజిక స్పృహ కలిగించే వీడియో ఫిలింస్ లో నటించాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం వైవా హర్షతో కలిసి ఒక షార్ట్ చేస్తే అది బాగా పేలింది. హీరోలు కేవలం సినిమాలకు పరిమితం కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తే గ్లోబల్ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యే అవకాశం దొరుకుతుంది.
This post was last modified on February 16, 2024 10:20 am
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…