Mrunal Thakur
సీతారామం సినిమాలో సీత పాత్రతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచింది మృణాల్ ఠాకూర్. ఈ మధ్య కాలంలో ఓ హీరోయిన్ ఇంతగా మెస్మరైజ్ చేయడం జరగలేదనే చెప్పాలి. చాలా ఏళ్ల పాటు ఈ పాత్రను మన ప్రేక్షకులు గుర్తుంచుకుంటారనడంలో సందేహం లేదు.
ఆ పాత్రలో మృణాల్‌కు ఎంతగా కనెక్ట్ అయ్యారంటే.. బాలీవుడ్లో ఆమె గ్లామర్ రోల్స్‌లో అందాలు ఆరబోస్తుంటే మన వాళ్లకు అస్సలు రుచించడం లేదు. ‘సీతారామం’ తర్వాత ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్న మృణాల్.. గత ఏడాది ‘హాయ్ నాన్న’ అనే మరో మంచి సినిమాతో పలకరించింది. అందులోనూ అందంగా కనిపిస్తూనే మంచి పెర్ఫామెన్స్ ఇచ్చింది మృణాల్. త్వరలోనే రాబోతున్న ‘ఫ్యామిలీ స్టార్’లో కూడా ఆమెకు మంచి పాత్రే పడ్డట్లుంది.
క్యారెక్టర్ల విషయంలో మృణాల్ సైతం తెలుగు సినిమాలతో బాగా కనెక్ట్ అయినట్లు కనిపిస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె బాలీవుడ్‌తో పోల్చి మరీ తెలుగు సినిమాలకు ఎలివేషన్ ఇవ్వడం విశేషం. తనకు సౌత్‌లోనే మంచి పాత్రలు వస్తున్నాయని.. అలాంటి పాత్రలు బాలీవుడ్లో తనకు దొరకడం లేదని ఆమె పేర్కొంది.
పేరుకు సౌత్ అంది కానీ.. ఆమె వరుసగా సినిమాలు చేస్తోంది తెలుగులోనే కాబట్టి టాలీవుడ్‌కే ఎలివేషన్ ఇచ్చినట్లు భావించవచ్చు. ఇక బాలీవుడ్లో తనకు కెరీర్ ఆరంభంలో అవమానాలు ఎదురైనట్లు కూడా మృణాల్ చెప్పింది. తనను పల్లెటూరి పిల్ల అన్నారని.. గ్లామర్ రోల్స్‌కు సరిపోనని తీసి పడేశారని.. అలా రిజెక్షన్ కు గురైన తాను తర్వాత తనేంటో రుజువు చేసుకున్నానని మృణాల్ చెప్పింది.
This post was last modified on February 10, 2024 7:04 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నోబెల్ ప్రపంచ శాంతి పురస్కారం కోసం వేయి కళ్లతో ఎదురు చూసిన విషయం తెలిసిందే.…