కొన్ని రోజులుగా అనుకుంటున్నదే.. కాకపోతే కొంచెం ఆలస్యంగా జరిగింది. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతికి సంబంధించిన కేసులు అనేక ఆరోపణలు ఎదుర్కొన్న అతడి మాజీ ప్రేయసి రియా చక్రవర్తి అరెస్టయింది. కానీ ఆమె అరెస్టయింది సుశాంత్ మృతికి సంబంధించిన వ్యవహారంలో కాదు. మాదక ద్రవ్యాల కేసులో. ఆమెను అరెస్టు చేసింది కూడా జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక సంస్థనే. సుశాంత్ కేసుకు సంబంధించి సీబీఐ అధికారుల విచారణలో భాగంగా రియా చక్రవర్తి డ్రగ్స్ వాడేదని, బాలీవుడ్లో తరచుగా డ్రగ్స్ వాడే బ్యాచ్‌లో రియా కూడా ఒకరని.. ఆమె సోదరుడికి కూడా ఇందులో ప్రమేయం ఉందని వెల్లడైన సంగతి తెలిసిందే. దీంతో డ్రగ్స్ నిరోధక అధికారులు కొన్ని రోజులుగా రియాను విచారిస్తున్నారు.
తాజాగా విచారణకు హాజరైనపుడే రియా నుంచి కీలక సమాచారం రాబట్టారని, ఆమె ఈ కేసులో ఇరుక్కోవడం ఖాయమని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం రియాను అధికారులు అరెస్టు చేశారు. బాలీవుడ్ ప్రముఖులకు మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వ్యక్తులు రియా పేరు చెప్పారని.. ఆమెతో పాటు పలువురి పేర్లు బయట పడ్డాయని.. త్వరలో మరికొందరు అరెస్టయ్యే అవకాశముందని బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఐతే ఇంతకుముందు టాలీవుడ్లో సైతం ఇలా పలువురికి డ్రగ్స్‌తో సంబంధం ఉందని హైదరాబాద్ పోలీసు అధికారులు నోటీసులివ్వడం, విచారించడం చేశారు. అప్పట్లో అదో పెద్ద సంచలనం అయింది. కానీ ఆ తర్వాత ఈ కేసులో ఏ పురోగతీ లేదు. ఆ కేసు పక్కకు వెళ్లిపోయింది. ఎలాంటి చర్యలూ లేవు. మరి బాలీవుడ్లో సైతం ఊరికే కొన్ని రోజులు హడావుడి చేసి వదిలేస్తారా.. లేక నిజంగా చర్యలు చేపడతారా అన్నది చూడాలి.
This post was last modified on September 8, 2020 7:28 pm
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు. గ్యాప్…
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…
సీఎం చంద్రబాబు .. రాజధాని అమరావతికి బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగలరని…