నాని సినిమా ఓటిటిలో విడుదలవుతోందనే సంబరం ఒక్క రోజయినా లేకుండా స్ట్రీమింగ్ మొదలైన రెండు గంటలకే ఆనందం ఆవిరైపోయింది. వి చిత్రానికి యునానిమస్‍గా బ్యాడ్ రిపోర్ట్స్ రావడంతో పాటు ఈ చిత్రంలోని చాలా సన్నివేశాలను కామెడీ చేసుకుంటున్నారు.
ఇంత రొటీన్ స్క్రిప్ట్ ని నాని ఎందుకు అంగీకరించాడనేది ఎవరికీ అర్థం కావడం లేదు. పైగా తన ఇరవై అయిదవ చిత్రంగా వి సెలక్ట్ చేసుకున్నాడు. చూస్తోంటే దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణని నాని గుడ్డిగా నమ్మేసినట్టున్నాడు.
అంతకుముందు తనతో అష్టాచమ్మా, జెంటిల్‍మేన్ తీసిన దర్శకుడు మిస్ ఫైర్ అవుతాడని బహుశా ఊహించి వుండడు. అయితే కనీసం కథ విని బేసిక్ డౌట్స్ అయినా రైజ్ చేసి వుండాల్సింది. వేగంగా సినిమాలు పూర్తి చేసేయాలని చూస్తోన్న నాని స్క్రిప్ట్ ఎంత పకడ్బందీగా వుందనేది చూసుకోవడం లేదనిపిస్తోంది. ఇంతకుముందు వచ్చిన గ్యాంగ్‍లీడర్ కూడా హాఫ్ బేక్డ్ స్క్రిప్ట్ తో, నిండా లూప్‍హోల్స్ తో తేలిపోయింది.
ఆ సినిమాలో కాస్త కామెడీ అయినా పండింది కాబట్టి ఈ స్థాయిలో విమర్శలు రాలేదు కానీ ‘వి’ మామూలుగా రిలీజయి ఫ్లాపయి వుంటే మాత్రం నానికి బాగా డ్యామేజ్ జరిగేది. దర్శకులను గుడ్డిగా నమ్మేయకుండా, జెర్సీ లాంటి పకడ్బందీ కథలు తీసుకొచ్చిన దర్శకులకే ఛాన్స్ ఇస్తే మంచిది.
This post was last modified on September 8, 2020 9:27 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…