సంక్రాంతి సినిమాల హడావుడి బాగా తగ్గింది. ఒక్క హనుమాన్ మాత్రం ఇంకా సందడి చేస్తోంది. తర్వాతి రెండు వారాల్లో తెలుగు సినిమాల రిలీజే లేదు. రిపబ్లిక్ డే వీకెండ్లో రెండు డబ్బింగ్ సినిమాలు రిలీజైనా అవి పెద్దగా ప్రభావం చూపించలేదు. బోలెడన్ని థియేటర్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త సినిమాల కోసం ఎదురు చూస్తున్నాయి. ఐతే వచ్చే వారం ‘ఈగల్’ లాంటి పెద్ద సినిమా షెడ్యూల్ అయి ఉండగా.. ఈ వారానికి మిడ్ రేంజ్ సినిమాలు కూడా ఏవీ లైన్లో లేవు. ఈ వీకెండ్‌ను చిన్న సినిమాలకే రాసిచ్చేసినట్లు కనిపిస్తోంది.
ఐతే ఖాళీ ఉంది కదా అని ఒకేసారి బోలెడన్ని చిన్న సినిమాలను దించేస్తున్నారు. వాటిలో ఒక్క ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ మాత్రమే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంట్రెస్టింగ్ టీజర్, ట్రైలర్.. మంచి పాటలు.. సుహాస్ ట్రాక్ రికార్డు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. సెలబ్రెటీల సపోర్ట్ కూడా లభించడం.. పెయిడ్ ప్రిమియర్స్ వేయడంలో కాన్ఫిడెన్స్ సినిమాకు బజ్ తీసుకొచ్చాయి.
చూస్తుంటే ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ మంచి సక్సెస్ అయ్యేలా, సుహాస్ ఇమేజ్‌ను ఇంకా పెంచేలా కనిపిస్తోంది. ఐతే ఈ వారం షెడ్యూల్ అయిన ఇంకే సినిమా కూడా ఇందులో కొంతమేర కూడా బజ్ సంపాదించలేకపోయాయి. రెండంకెల సంఖ్యలో సినిమాలు రిలీజవుతున్నాయన్నమాటే కానీ.. వాటిలో చాలా సినిమాల పేర్లు కూడా జనాలకు తెలియడం లేదు. బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా నటించిన బూట్‌కట్ బాలరాజు.. అభినవ్ గోమఠం, నరేష్ అగస్త్య, అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రలు పోషించిన కిస్మత్ సినిమాల పరిస్థితి కొంచెం పర్వాలేదు. కానీ వాటికి కూడా చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ వస్తాయన్న గ్యారెంటీ లేదు.
ఇక యశ్ పూరి నటించిన హ్యాపీ ఎండింగ్‌కు కొంతమేర పబ్లిసిటీ కలిసి వస్తోంది. అది కాకుండా ధీర, గేమ్ ఆన్, ఐ హేట్ యు, మెకానిక్.. ఇలా ఏవేవో సినిమాలు వస్తున్నాయి ఈ వారం. వీటి గురించి ప్రేక్షకులకు కనీస పట్టింపు కూడా ఉన్న సంకేతాలు కనిపించడం లేదు.
This post was last modified on February 1, 2024 11:06 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…