సంక్రాంతి కానుకగా విడుదలైన ‘హనుమాన్’ సినిమా ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. చిన్న సినిమా అనుకున్నది కాస్తా.. సంక్రాంతి చరిత్రలోనే అత్యంత పెద్ద సినిమాగా అవతరించింది. దశాబ్దాల సంక్రాంతి చరిత్రలో పెద్ద సినిమాలన్నింటినీ వెనక్కి నెట్టి హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవడం అంటే మాటలు కాదు. దీంతో ‘హనుమాన్’కు కొనసాగింపుగా రానున్న ‘జై హనుమాన్’పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
పూర్తిగా హనుమంతుడి పాత్ర చుట్టూ తిరిగే ఆ కథలో లీడ్ రోల్ ఒక స్టార్ హీరోనే చేస్తాడని దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించడంతో ఆసక్తి ఇంకా పెరిగింది. ఆ పాత్రకు చాలామంది మదిలో మెదులుతున్న పేరు మెగాస్టార్ చిరంజీవిదే. అసలు ‘హనుమాన్’లోనే హనుమంతుడి రూపంలో చిరునే కనిపించవచ్చని ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాలేదు.
కట్ చేస్తే చూస్తే ‘హనుమాన్’లో హనుమంతుడి పాత్రకు చిరంజీవిని అడుగుతానని ప్రశాంత్ వర్మ చెప్పాడు. మరోవైపు రాముడి పాత్రలో మహేష్ బాబును ఊహించుకుంటున్న సంగతీ వెల్లడించాడు. కానీ ఈ పాత్రల్లో ఆ నటులు నిజంగానే కనిపిస్తారా అంటే సందేహంగానే కనిపిస్తోంది. ‘జై హనుమాన్’కు ఉన్న క్రేజ్ దృష్ట్యా చిరు హనుమంతుడి పాత్రలో నటిస్తే బాగానే ఉంటుంది. కానీ ఆల్రెడీ ‘విశ్వంభర’ అనే భారీ చిత్రం చేస్తున్నారు. అందులో హనుమంతుడి పాత్ర కీలకం అని ఈ మధ్య రిలీజ్ చేసిన గ్లింప్స్ చూస్తే అర్థమైంది. అలాంటపుడు ఇక్కడ చిరు హనుమంతుడి పాత్ర చేస్తే ఆ సినిమా డైల్యూట్ అయిపోతుంది.
ఇక మహేష్ బాబేమో రాజమౌళితో భారీ చిత్రానికి మేకోవర్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అది చేస్తూ.. చిన్న క్యామియో లాంటి శ్రీరాముడి పాత్ర చేయడానికి ఓకే చెబుతాడా అన్నది సందేహమే. ప్రశాంత్ ఆలోచన బాగున్నప్పటికీ.. అది కార్యరూపం దాల్చడం కష్టంగానే కనిపిస్తోంది.
This post was last modified on January 31, 2024 9:49 pm
స్విట్జర్లాండ్లోని దావోస్లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు టాప్ జాబ్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ…
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్…
ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరో జన్మ అంటూ ఉంటే.. మళ్లీ తెలుగు వాడిగానే…